మైత్రీ మూవీ మేకర్స్‌తో మరో సినిమా చేయనున్న సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu)

Updated on May 05, 2022 07:00 PM IST
మైత్రీ మూవీ మేకర్స్‌, మహేష్‌బాబు (MaheshBabu)
మైత్రీ మూవీ మేకర్స్‌, మహేష్‌బాబు (MaheshBabu)

సూపర్‌‌స్టార్ కృష్ణ నటవారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మహేష్‌బాబు (MaheshBabu).. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్‌ హీరోగా కొనసాగుతున్నాడు.  మహేష్‌ నటించిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది మైత్రీ మూవీ మేకర్స్. ఆ సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కు భారీ లాభాలే తెచ్చి పెట్టింది. దీంతో అప్పటి నుంచి ఆ సంస్థ భారీ బడ్జెట్‌ సినిమాలనే నిర్మిస్తోంది.

ఇటీవల మహేష్‌  హీరోగా నటించిన సర్కారు వారి పాట, నాని హీరోగా నటించిన అంటే సుందరానికీ, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, పుష్ప ది రూల్, మెగాస్టార్ చిరంజీవి– బాబి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా, గోపీచంద్‌ మలినేని – బాలకృష్ణ కాంబో, విజయ్‌ దేవరకొండ – సమంత – శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

మహేష్‌బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ఈనెల 12న రిలీజ్‌ కాబోతోంది. ఈ సినిమాలో మహేష్‌కు జంటగా కీర్తి సురేష్‌ నటిస్తోంది. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో ఉండగా.. మహేష్‌ తర్వాత సినిమాలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే రెండు మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడీ సూపర్‌‌స్టార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో, దర్శక ధీరుడు రాజమౌళితో సినిమాలకు ఓకే చెప్పాడు. వీటిలో ఒకటి పాన్‌ ఇండియా మూవీ కాగా.. మహేష్‌ (MaheshBabu) తర్వాత చేయబోయే సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సారధ్యంలోనే ఉండనుందని టాక్‌. దీనిపై త్వరలోనే అఫీషియల్‌గా కన్ఫర్మేషన్‌ రానున్నట్టు తెలుస్తోంది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!