‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేయనున్న సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (MaheshBabu)

Updated on May 07, 2022 12:22 AM IST
సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటలో మహేష్‌బాబు (MaheshBabu) , కీర్తి సురేష్
సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాటలో మహేష్‌బాబు (MaheshBabu) , కీర్తి సురేష్

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (MaheshBabu) నటించిన  సర్కారువారి పాట. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. అయితే సినిమా పూర్తవగానే రిలీఫ్‌కోసం విదేశాలకు వెళ్లే మహేష్‌ ఈ సినిమా పూర్తవగానే ప్యారిస్‌ వెళ్లారు. కుటుంబంతో అక్కడ దిగిన ఫొటోలను ఆయన సతీమణి నమ్రత ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. అయితే విదేశాల్లో ఉండడం వల్ల మహేష్‌ ప్రమోషన్లలో పాల్గొనరనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు మహేష్‌. గురువారం ఉదయం ఆయన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కుటుంబంతోపాటు కనిపించారు. ఈ ఫొటోలు చూసిన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తోన్నారు.

మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ట్విటర్‌లో ‘సర్కారువారి పాట’ ఎమోజీ విడుదలైంది. తెలుగులో ట్విట్టర్‌ ఎమోజీ పొందిన తొలి సినిమాగా నిలిచింది. మొత్తంగా దక్షిణాది నుంచి కేజీఎఫ్‌2,సాహో తర్వాత సర్కారువారి పాట ట్విట్టర్‌ ఎమోజీ లను సొంతం చేసుకున్నది. ఇకపై ట్విట్టర్‌ లో సర్కారువారి పాట అని టైప్‌ చేయగానే ఎస్‌వీపీ మానియా,ఎస్‌వీపీ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో మహేష్‌ స్టైలిష్‌ లుక్‌ కనిపిస్తుంది.

కాగా, మే 7న శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అభిమానుల సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొననున్నారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

అయితే,‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథులుగా ఎవరు పాల్గొంటారనే విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలువురు స్టార్‌ హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌ అయిన రాజమౌళి, త్రివిక్రమ్‌, పూరీ జగన్నాథ్‌. ఈ కార్యక్రమంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరితో మహేశ్‌కు మంచి స్నేహబంధం ఉందని, అందుకే వారు ముగ్గురూ ఈ స్టేజ్‌పై కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ విజయ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాడని వార్తలు వచ్చాయి. వీటిలో ఏది నిజమో తెలియాలంటే మాత్రం రేపటిదాకా ఆగక తప్పదు.

గీత గోవిందం’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న పరశురామ్‌, తన తాజా చిత్రంగా ’సర్కారువారి పాట’ సినిమాను రూపొందించాడు. మైత్రీ - 14 రీల్స్‌ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. తాజా ఇంటర్వ్యూలో పరశురామ్‌ మాట్లాడుతూ .. ‘ఈ సినిమాలో మహేశ్‌ బాబు క్యారెక్టరైజేషన్‌ చాలా డిఫరెంట్‌ గా ఉంటుంది. ఇంతకుముందు మహేశ్‌ బాబు (MaheshBabu) చేసిన ఏ సినిమాలోని పాత్రను .. ఈ సినిమాలోని పాత్రతో పోల్చలేము. ఈ సినిమాలో ఆయన పాత్ర యాటిట్యూడ్‌ చాలా కొత్తగా కనిపిస్తుంది.’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో కీర్తిసురేష్‌ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్‌ మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌,14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని,రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!