అడివి శేష్‌ (Adivi Sesh) ‘హిట్‌ 2’ సినిమాలో మీనాక్షి చౌదరి, రావు రమేష్‌ క్యారెక్టర్ల ఫస్ట్‌ లుక్ రిలీజ్‌ !

Updated on Nov 01, 2022 09:28 PM IST
విశ్వక్‌సేన్ (Vishwaksen) నటించిన హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న హిట్‌2లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్నారు.
విశ్వక్‌సేన్ (Vishwaksen) నటించిన హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న హిట్‌2లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్నారు.

మేజర్‌‌ వంటి హిట్ సినిమా తర్వాత యంగ్ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) నటిస్తున్న సినిమా హిట్‌2. ది సెకండ్ కేస్ అనేది ట్యాగ్‌ లైన్. విశ్వక్‌సేన్ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ఈ సినిమా. హిట్‌ సినిమా పాజిటివ్‌ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. దీంతో ఈ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.

మేజర్ సినిమా తర్వాత అడివి శేష్‌ చేస్తున్న సినిమా కావడంతో హిట్‌2పై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌‌కు కూడా మంచి స్పందన వచ్చింది. దాంతో హిట్‌2 సినిమా నుంచి ఎప్పుడు ఏ అప్‌డేట్స్ వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్.

విశ్వక్‌సేన్ (Vishwaksen) నటించిన హిట్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న హిట్‌2లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్నారు.

పోస్టర్లతో మరింత ఆసక్తి...

హిట్‌2లో అడివి శేష్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. హీరోయిన్ క్యారెక్టర్‌‌ను పరిచయం చేస్తూ పోస్టర్‌‌ రిలీజ్ చేశారు మేకర్స్. ఆర్య పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్టు వెల్లడించారు. ఇక, హిట్‌2లో కీలకపాత్ర పోషిస్తున్న టాలెంటెడ్ యాక్టర్ రావు రమేష్ ఫస్ట్‌ లుక్‌ను కూడా రివీల్ చేసింది చిత్ర యూనిట్. సినిమా టీంలోకి రావు రమేష్‌కు స్వాగతం పలుకుతూ పోస్టర్‌‌ను విడుదల చేశారు దర్శకుడు శైలేష్ కొలను. అడిషనల్ డైరెక్టర్ జనరల్‌ ఆఫ్ పోలీస్‌గా ఆయన నటిస్తున్నారని అర్థమవుతోంది.

డిసెంబర్ 2, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న అడివి శేష్‌ (Adivi Sesh) హిట్‌2 సినిమాకు జాన్ స్టీవర్ట్ సంగీతం అందిస్తున్నారు. నవంబర్ 3వ తేదీన ఈ సినిమా టీజర్‌‌ను లాంఛ్ చేయనున్నట్టు డైరెక్టర్ శైలేష్‌ కొలను వెల్లడించారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌పై ప్రశాంతి త్రిపిర్నేని, నేచురల్ స్టార్ నాని హిట్‌2 సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  

Read More : పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉన్నానంటున్న ‘మేజర్’ హీరో అడివి శేష్‌ (Adivi Sesh).. డ్రగ్స్, పొగకు దూరంగా ఉంటా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!