Major Movie: ఆకట్టుకుంటున్న అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Updated on Jun 04, 2022 05:32 PM IST
మేజర్ మూవీ పోస్టర్స్ (Major Movie Posters)
మేజర్ మూవీ పోస్టర్స్ (Major Movie Posters)

అడవి శేష్‌ (Adivi Sesh) హీరోగా, శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో రూపొందిన చిత్రం `మేజర్‌`.  బయోగ్రాఫికల్ యాక్షన్ చిత్రమిది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్‌ (Saiee Manjrekar), శోభితా దూళిపాళ్ల  హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2008లో ముంబయిలో జరిగిన 26/11 ఘటనలో పోరాడిన ఇండియన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నిక్రిష్ణన్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. 

జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలైంది. అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. 

మరోవైపు మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ ఖాలీగా ఉంటున్నాయి. పూర్తిగా నిండడం లేదు. ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.147 సింగిల్ స్క్రీన్ కి, రూ.177 మల్టీప్లెక్స్ ఉండనున్నాయి.

ఇప్పటికే ఈ చిత్రం మీద ఉన్న నమ్మకంతో మేకర్స్ మే 24 నుంచే అభిమానుల కోసం సినీ ఇండస్ట్రీ చరిత్రలో తొలిసారిగా ప్రీ ప్రీమియర్ వేశారు. దేశంలోని 9 ప్రధాన నగరాలైన.. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్, కొచ్చి, లక్నో, జైపూర్, అహ్మదాబాద్, ముంబయి, పూణేలో ముందస్తుగానే సినిమాను ప్రదర్శించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నారు. కాగా, ఈరోజు (జూన్ 3)న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దేశభక్తిని చాటే సినిమా కావడంతో అందరినీ మెప్పిస్తోంది.

అయితే, అడవి శేష్ మేజర్ తర్వాత హిట్ సినిమా సీక్వెల్‌లో నటించబోతున్నారు. హిట్ సినిమా మొదటి పార్ట్ లో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చేసింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. స్ట్రీమింగ్ పార్ట్నర్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ మేజర్ రైట్స్ ను భారీ డీల్ కే దక్కించుకున్నట్టు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!