Major Movie: 'మేజర్' మూవీ ప్రీమియర్ షో లో సందీప్ ఉన్ని కృష్ణన్ తండ్రి భావోద్వేగం..!

Published on Jun 05, 2022 11:39 AM IST

Major Movie: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన మేజర్ సినిమాకు విశేష స్పందన లభిస్తోంది. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ (Sandeep UnniKrishnan) పాత్రలో శేష్ నటన అద్భుతమంటూ ప్రశంసిస్తున్నారు. దేశభక్తి లీడ్ తో తీసిన ఈ సినిమా తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో విడుదలై అంతటా పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంటోంది. 

ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాగా.. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. దేశ కోసం తుపాకీ తుటాల‌కు ఎదురెళ్లిన రియ‌ల్ హీరోకు ఆడియన్స్ సెల్యూట్ చేస్తున్నారు. ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ (Adivi Shesh)ఒదిగిపోయారు. ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తుండడంతో మూవీ మేకర్స్ నేడు సక్సెస్ మీట్ నిర్వహించారు.

అయితే, మేజర్ మూవీ అంత బాగా రావడానికి కారణం కథ ఒక్కటే కాదు.. అందులోని పాత్రలు కూడా. ప్రతీ ఒక్కరూ తమ క్యారెక్టర్స్ లో లీనమై నటిస్తున్నారనే భావన లేకుండా జీవించేశారు. అందుకే ఈ సినిమా అందరి చేతా ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మేజర్ సినిమాలో హీరోకి తండ్రిగా నటించిన ప్రకాశ్ రాజ్ (Actor Prakash Raj) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రైనా అలవోకగా చేసి, ప్రేక్షకులను అలరించడంలో దిట్ట. 

ఆయన కూడా ఈ మూవీలో తన క్యారెక్టర్ గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. రియల్ మ్యాన్ ఇస్రో ఆఫీసర్ మిస్టర్ ఉన్నికృష్ణన్ మా హీరో మేజర్ తండ్రి ఉన్నికృష్ణన్‌తో కలిసి #మేజర్ ఫిల్మ్‌లో నేను పోషించిన పాత్ర.. నా జీవితంలో మరచిపోలేనిది అంటూ ఆయన ట్వీట్ చేశారు. @ShashiTikka, @AdiviSesh, @urstrulyMahesh అనే ట్యాగ్ లను జోడిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.