లైగర్ సినిమా సక్సెస్ అవుతుందంటున్న విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda).. పర్సనల్ లైఫ్‌పైనా ఆసక్తికర కామెంట్లు

Updated on Aug 14, 2022 03:51 PM IST
తనతో డేటింగ్‌లో ఉన్న వ్యక్తి గురించి చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగించలేనని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)
తనతో డేటింగ్‌లో ఉన్న వ్యక్తి గురించి చెప్పి తన ప్రైవసీకి భంగం కలిగించలేనని అన్నారు రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

తాను ఎవరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానో చెప్పి ఆమెను ఇబ్బందిపెట్టాలని అనుకోవడం లేదని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ‘లైగర్‌’  సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ ఈ విషయాలపై స్పందించారు. తన పర్సనల్ లైఫ్‌తోపాటు రిలేషన్‌షిప్ స్టేటస్‌ గురించి కూడా మాట్లాడారు.

నా పర్సనల్ లైఫ్‌ గురించి మాట్లాడటం ఇష్టం లేదు. నాతో రిలేషన్‌లో ఉన్న వ్యక్తి గురించి అందరితో చెప్పలేను. అలా చేస్తే ఆమె ప్రైవసీకి భంగం కలుగుతుంది. ఒక యాక్టర్‌‌గా పబ్లిక్‌ లైఫ్‌లో ఉండడం నాకు ఇష్టమే. అయితే నాలాగా పబ్లిక్‌లో ఫోకస్ కావడం తనకు ఇష్టం లేకపోవచ్చు అని చెప్పారు విజయ్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

లైగర్ సక్సెస్‌ ఎంజాయ్ చేస్తా..

బీటౌన్‌లో ఇప్పటివరకూ ఏ ప్రాజెక్ట్‌కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అంత ఇంట్రెస్టింగ్‌ స్క్రిప్ట్‌ ఏదీ రాలేదు. అయినా కొత్త ప్రాజెక్టులు ఓకే చేయాలని అనుకోవడం లేదు. లైగర్‌‌ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయాలని అనుకుంటున్నాను. ప్రస్తుతం ఖుషి, జనగణమన సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులు ఓకే చేయాలని అనుకుంటున్నాను. 

అదే నా టెన్షన్..

‘అర్జున్‌ రెడ్డి’ సినిమా తర్వాత ముంబయిలో కరణ్‌ జోహార్‌ని కలిశాను. ఆ సినిమాలో నా నటన ఆయనకు బాగా నచ్చింది. నాతో సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో నేనందుకు రెడీగా లేను. ‘లైగర్‌’ స్క్రిప్ట్‌ విన్న తర్వాత ఆ సినిమాను నిర్మించడానికి ఓకే చెప్పారు కరణ్. ‘లైగర్‌’ సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాను. లైగర్ తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది. హైదరాబాద్‌కు చెందిన నేను దేశంలో ఉన్న ప్రేక్షకులందరికీ నచ్చుతానా లేదా అనేదే నా టెన్షన్.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

ఫ్యూచర్‌‌లో లోకేశ్‌ కనగరాజ్‌తో సినిమా చేస్తా..!

లైగర్ సినిమాలో నా క్యారెక్టర్‌‌ను అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాలో క్యారెక్టర్‌‌ కోసం ఫిట్‌గా ఉండడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. డ్రింకింగ్ మానేశాను. కమల్‌ హాసన్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విక్రమ్’ సినిమా చూశాను. లోకేశ్ సినిమాటిక్ ప్రపంచంలో భాగం కావాలని అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఆయనతో సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).

Read More : విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) డేటింగ్ పుకార్లపై రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఆసక్తికర సమాధానం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!