విజయ్ దేవరకొండతో (Vijay Deverakonda) డేటింగ్ పుకార్లుపై లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఆసక్తికర సమాధానం

Updated on Aug 11, 2022 08:13 PM IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Vijay Deverakonda, Rashmika Mandanna)
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Vijay Deverakonda, Rashmika Mandanna)

టాలీవుడ్ లో 'ఛలో' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna). మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మికకు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి 'గీతగోవిందం' సినిమాలో కలిసి నటించే అవకాశం వచ్చింది. ఇక, ఈ సినిమాలో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా కావడమే కాకుండా వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు షికారు చేశాయి. 

విజయ్ తో రష్మిక ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. 'కాఫీ విత్ కరణ్' షోలో పలువురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor), సారా అలీ ఖాన్ వంటి సెలబ్రిటీలు కూడా విజయ్ , రష్మిక గురించి మాట్లాడటంతో వీళ్లు నిజంగానే రిలేషన్ లో ఉన్నారు అని అంతా భావిస్తున్నారు. తాజాగా ఇదే షోలో రష్మికపై మీ అభిప్రాయం ఏంటని విజయదేవరకొండను ప్రశ్నించగా ఆమె నా 'డార్లింగ్' అని సమాధానమిచ్చాడు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా (Vijay Deverakonda, Rashmika Mandanna)

ఈ విషయంపై ఇద్దరిలో ఎవరిని అడిగినా మేము మంచి స్నేహితులం అని చెప్పి వదిలేస్తున్నారు. కానీ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని ముంబయి వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని సమాచారం. ఇక, విజయ్ (Vijay Deverakonda), రష్మిక ఇద్దరిలో ఎవరు మీడియా ముందుకి వచ్చినా వీళ్ళ రిలేషన్ గురించి కచ్చితంగా అడుగుతున్నారు. 

ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక (Rashmika Mandanna)క బాలీవుడ్ లో ఓ ఇంటర్వ్యూ ఇవ్వగా అక్కడ కూడా విజయ్ గురించి ప్రశ్న ఎదురైంది. మీరు విజయ్ తో డేటింగ్ చేస్తున్నారంట నిజమేనా అని అడిగారు. దీనికి రష్మిక.. ‘నేనొక నటిని. ఏడాదికి ఐదారు సినిమాలు వేరే వేరే హీరోలతో చేస్తుంటా. కానీ మీరు మాత్రం నా రిలేషన్​ షిప్​ గురించే అడుగుతుంటారు. బయట జరిగే ప్రచారాన్ని నేను పట్టించుకోను. నా రిలేషన్​ ఎవరితో అనేది నేను చెప్పేదాకా.. బయట జరిగే ప్రచారాన్ని మీరు కూడా ఎంజాయ్​ చేయండి’ అంటూ యాంకర్ ​కు అదిరిపోయే సమాధానం ఇచ్చింది.

రష్మిక మందన్నా సినిమాల విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హీరోగా 'గుడ్‌బై' అనే మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో 'మిషన్ మజ్ను' అనే స్పైథ్రిల్లర్‌లో కూడా నటిస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్ కు జోడీగా 'యానిమల్' చిత్రంలో నటిస్తోంది.

Read More: Vijay Devarakonda: 'రష్మిక నా డార్లింగ్‌ అంటున్న విజయ్'.. అసలు విషయం బయటపెట్టిన అనన్య పాండే(Ananya Pandey)..!


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!