Liger: 'లైగ‌ర్' కోకా 2.0 సాంగ్ రిలీజ్: పంజాబీ బీట్‌కు అదిరిపోయే స్టెప్పులేసిన విజ‌య్ (Vijay Deverakonda), అన‌న్య‌

Updated on Aug 12, 2022 07:47 PM IST
Liger: 'లైగ‌ర్' నుంచి కోక 2.0 సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పంజాబీ స్టైల్ బీట్స్‌కు విజయ్  (Vijay Deverakonda) , అన‌న్య‌లు అదిరిపోయే స్టెప్పులేశారు.
Liger: 'లైగ‌ర్' నుంచి కోక 2.0 సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పంజాబీ స్టైల్ బీట్స్‌కు విజయ్  (Vijay Deverakonda) , అన‌న్య‌లు అదిరిపోయే స్టెప్పులేశారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌రకొండ (Vijay Deverakonda) న‌టించిన‌ 'లైగ‌ర్ చిత్రం' నుంచి మేక‌ర్స్ మ‌రో పాట‌ను రిలీజ్ చేశారు. 'కొనిస్త‌నే.. కోక..కోక' అంటూ సాగిన వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట పంజాబీ బీట్స్‌తో సాగింది. విజ‌య్ దేవ‌ర‌కొండ పంజాబీ బీట్‌కు అదిరిపోయే స్టెప్పులేశారు. విజ‌య్, అన‌న్య‌లు డాన్సుల‌తో అద‌ర‌గొట్టారు. ప్ర‌స్తుతం కోక 2.0 సాంగ్ య్యూటూబ్‌లో దూసుకెళుతుంది. 

డ‌బుల్ బీట్ సాంగ్ 'కోక 2.0'

'లైగ‌ర్' చిత్రంలోని కోక 2.0 పాట‌కు భాస్క‌ర‌భ‌ట్ల ర‌వి కుమార్ లిరిక్స్ రాశారు. గాయ‌కులు రామ్ మిర్యాల‌, గీతా మాధురి గీతాన్ని ఆల‌పించారు. కోక 2.0 పాట‌కు జానీ, లిజో జార్జ్‌, డీజే చెటాస్ సంగీతం స‌మ‌కూర్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) పంజాబీ స్టైల్‌లో త‌ల‌పాగా, కుర్తా పైజామా ధ‌రించారు. అన‌న్య పాండే లెహంగాలో అద‌ర‌గొట్టారు. ఇక వీరిద్ద‌రూ కోక 2.0 పాట‌కు పంజాబీ స్టెప్పుల‌తో ఇర‌గ‌దీశారు. డ‌బుల్ ఎన‌ర్జీతో డ‌బుల్ బీట్ పాట‌గా కోక 2.0 య్యూటూబ్‌లో దూసుకెళుతుంది.

'లైగ‌ర్' సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన 'అక్‌డి.. ప‌క్‌డి', 'వాట్ ల‌గా దేంగే' పాట‌లకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ పాట‌లు మిలియ‌న్ల వ్యూస్ సాధించాయి. ప్ర‌స్తుతం రిలీజ్ అయిన‌ కోక 2.0 సాంగ్ ఎలాంటి రికార్డు బ్రేక్ చేస్తుందో చూడాలి. 

'లైగ‌ర్' చిత్రాన్ని పాన్ ఇండియా లెవ‌ల్‌లో ద‌ర్శ‌కుడు పూరీ జ‌గన్నాథ్ తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read More: Liger: గుజ‌రాతీ వంటకాలకు 'ఫిదా' అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda), అన‌న్య పాండే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!