Liger Movie Review: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన ‘లైగర్’ సినిమా మాస్‌ ప్రేక్షకులకు మాత్రమే !

Updated on Aug 25, 2022 05:39 PM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజైంది.
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజైంది.

'పెళ్లిచూపులు ' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). ఇప్పుడు  'లైగర్ ' సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిన  'లైగర్ ' సినిమా ఆగస్టు 25 న విడుదలైంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ఇది. దీంతో  ప్రేక్షకులతో పాటు, విజయ్ దేవరకొండ  అభిమానులు సైతం ఈ  'లైగర్ ' చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

పాన్‌ ఇండియా హవా కొనసాగుతున్న సమయంలో రిలీజ్ కావడంతో,  'లైగర్'కు (Liger) ఓపెనింగ్ బిజినెస్ భారీగా జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. గత కొన్నాళ్లుగా దేశాన్నంతా తమ సినిమా ప్రచారంతో హోరెత్తించింది  'లైగర్ ' చిత్ర యూనిట్. మరి ఈ రోజే రిలీజైన 'లైగర్  సినిమా' సమీక్షపై మనమూ ఓ లుక్కేద్దామా ..!

 క‌థేంటంటే: మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో త‌న కొడుకు  'లైగ‌ర్ '‌ని (విజ‌య్ దేవ‌ర‌కొండ)  జాతీయ ఛాంపియన్‌‌‌గా చూడాలన్నదే  బాలామ‌ణి (ర‌మ్యకృష్ణ) కల.  ఆమె భర్త కూడా ఫైటరే. దీంతో ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి మరింతగా తపిస్తుంటుంది.  అందుకోసమే  కొడుకుతో సహా కరీంనగర్ నుండి ముంబయికి వస్తుంది.  ఒక టీస్టాల్ పెడుతుంది. 

జీవితంలో  ఏదైనా సాధించాలంటే, అమ్మాయిల జోలికి వెళ్లకూడ‌ద‌ని బాలామ‌ణి త‌న కొడుకుకి హితవు పలుకుతుంది. కానీ,  తానియాతో (అన‌న్య పాండే)  ప్రేమ‌లో ప‌డ‌తాడు లైగర్. ఆ అమ్మాయి మాత్రం లైగ‌ర్‌కి న‌త్తి ఉంద‌ని తెలిసి దూర‌మ‌వుతుంది. మరి ప్రేమలో  విఫ‌లమైన లైగ‌ర్ త‌న లక్ష్యాన్ని చేరుకున్నాడా?  లేదా?  అనేది మిగిలిన సినిమా క‌థ‌.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజైంది.

ఎలా ఉందంటే: ఒక సాధార‌ణ ప్రేమ‌క‌థ‌కి, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అంశాన్ని జత చేస్తూ తీసిన సినిమా  'లైగర్‌‌ ' . దీంతో యాక్షన్ బ్యాక్ డ్రాప్‌ ఉన్న చిత్రంగానే  'లైగర్ 'పై ముద్ర పడింది. అయితే మార్షల్‌ ఆర్ట్స్‌‌ను ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని సాగే  ఈ సినిమాలో ఉండాల్సిన సీరియస్‌నెస్‌ లేదు.

కొన్ని సీన్లు మరీ కామెడీగా కూడా ప్రేక్షకులకు అనిపిస్తాయి. లైగర్, తానియాల ప్రేమ కథలో కూడా కొత్తదనం లేదు. ఓ ఇద్దరి పరిచయం, తర్వాత వారు ప్రేమలో పడడం, విడిపోవడం.. ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి సాధారణంగానే అనిపిస్తాయి. ఎన్నో సినిమాలలో చూసిన సీన్లే ఇవి. అలాగే సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా కథనే ముందే ఊహించేస్తాడు.

అయినప్పటికీ, విజయ్ దేవరకొండను 'లైగర్‌‌' పాత్రలో  కొత్తగా చూపించడంలో 'పూరీ' మార్క్‌ కనిపిస్తుంది. ఇక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ క్యారెక్టర్లు తప్పితే.. ఇతర పాత్రలేవీ కూడా అంత మెప్పించేలా లేవు.

కానీ విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. అదే సమయంలో ఆమెపై తీసిన కొన్ని సీన్లు మరీ ఓవర్‌‌గానూ అనిపిస్తాయి. రియాలిటీకి అద్దం పట్టే సన్నివేశాలను తీసే పూరీ.. 'లైగర్‌‌' సినిమాలో కొన్ని సీన్లను వాస్తవ దూరంగానే తెరకెక్కించారు. 

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజైంది.

ఎవ‌రెలా చేశారంటే: 'లైగర్‌‌'గా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న మెప్పిస్తుంది. క్యారెక్టర్‌‌ కోసం విజయ్‌ పడిన కష్టం, నత్తితో ఇబ్బంది పడే ఫైటర్‌‌గా  పాత్రలో జీవించిన తీరు, అందుకు ఆయన పడిన శ్రమ తెరపై కచ్చితంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా ఫైట్‌ సీన్లలో విజయ్‌ కష్టం బాగా తెలుస్తుంది. ఇక సినిమా ఫస్టాఫ్‌లో రమ్యకృష్ణ తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఇక హీరోయిన్‌ అనన్య పాండే గ్లామర్‌‌కే పరిమితమైంది. కథపై ఆమె క్యారెక్టర్‌‌ ప్రభావం పెద్దగా లేదు. 'లైగర్‌‌'కు శిక్షణను అందించే కోచ్ పాత్రలో రోనిత్‌ రాయ్‌ నటన బాగుంది. అలాగే అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ ఎంట్రీ కూడా ఆసక్తికరంగా ఉంది. క్లైమాక్స్‌లో కొద్ది సేపు మాత్రమే ఆయన కనిపిస్తారు. ముఖ్యంగా, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌‌ ఈ సినిమాకు అంతగా ప్లస్‌ కాలేదనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్..

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) యాక్టింగ్

ఫైట్లు, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం

మైనస్ పాయింట్లు..

- క‌థ‌నం

- సెకండాఫ్‌

ఫైనల్‌గా.. లైగర్‌‌.. మాస్ ప్రేక్షకుల కోసం మాత్రమే

నటీనటులు: విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌

మ్యూజిక్‌: సునీల్‌ కశ్యప్‌, విక్రమ్‌ మాంట్రోస్‌, తనిష్‌ భాగ్చి

ఎడిటింగ్‌: జునైద్‌ సిద్ధిఖీ

రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్‌

బ్యానర్‌: పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌

విడుదల తేదీ: 25–08–2022

రేటింగ్‌: 2 / 5

 

Read More : Liger: 'లైగ‌ర్' లైవ్ అప్‌డేట్స్ - విజ‌య్ దేవ‌ర‌కొండ  (Vijay Deverakonda) సినిమాపై ప్రేక్ష‌కుల రివ్యూ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!