‘లైగర్’ ఫ్లాప్ అయితే అనే కామెంట్‌కు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అదిరిపోయే సమాధానం

Updated on Aug 23, 2022 09:14 PM IST
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది
విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది

'లైగర్' సినిమాపై విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇది హిట్ అయితే విజయ్‌ పాన్ ఇండియా హీరో అయిపోతారు. పెళ్లి చూపులు లాంటి చిన్న చిత్రంతో మొదలైన విజయ్ దేవరకొండ ప్రస్థానంలో 'లైగర్'  ఒక గొప్ప మలుపులాంటిది. అందుకే ఈ సినిమా కోసం దేశమంతా తిరిగి మరీ విజయ్ ప్రచారం చేస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొదలైన విజయ్ సినీ ప్రయాణం పాన్ ఇండియా హీరో వరకు వెళ్లింది. ఈ సినిమా గనుక హిట్ అయితే విజయ్ రేంజ్ ఎక్కడికో వెళుతుంది అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు సహా అన్ని చోట్లా తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు విజయ్. అదే రేంజ్‌లో విజయ్‌కు ప్రేక్షకాదరణ కూడా దక్కుతోంది.

కాగా, లైగర్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న విజయ్ కు ఒక సూటి ప్రశ్న ఎదురైంది. 'ఒకవేళ లైగర్ ఫ్లాప్ అయితే మీ పరిస్థితి ఏంటి?' అని అడిగారు. ఇదే ప్రశ్న ఒకప్పటి విజయ్‌ను ఎవరైనా అడిగి ఉంటే.. వాళ్ల ముక్కు పచ్చడి చేసేవారు. అయితే సినిమా హిట్‌ ప్లాపులతో చాలా ఎదురుదెబ్బలు తిని హీరోగా ఎదుగుతున్నారు విజయ్. దీంతో విజయ్ ఈ ప్రశ్నకు చాలా కూల్‌గా సమాధానమిచ్చారు. 

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది

అప్పట్లో సీరియస్ అయిన విజయ్..

‘లైగర్ ఫ్లాప్ అవ్వడం అన్నది చాలా చిన్న విషయం. దానికి కోపంతో ఊగిపోవాల్సిన పనిలేదు. నాకు కోపం ఎక్కువ. కొన్నాళ్ల కిందట ఈ ప్రశ్న అడిగితే మీపై విరుచుకుపడి మరీ సమాధానం ఇచ్చేవాడిని. కానీ కొన్ని రోజులుగా అభిమానులు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. నాకు ప్రేక్షకులే ముఖ్యం. వాళ్ల కోసమే సినిమా చేశాను. ప్రచారంలో వాళ్ల ప్రేమను గెలుచుకున్నా. లైగర్ ఫ్లాప్ అయినా బాధపడను’ అని చాలా కూల్‌గా ఆన్సర్ ఇచ్చారు విజయ్.

ఈ సమాధానం విన్న వాళ్లు మన  రౌడీ బాయ్‌లో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు. అర్జున్ రెడ్డి టైంలో సినిమాను అడ్డుకున్న కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై సీరియస్ అయిన విజయ్ (Vijay Deverakonda).. ఇప్పుడు లైగర్ వరకూ వచ్చేసరికి ఎంతో మెచ్యూరిటీగా ఆన్సర్‌‌ చెప్పారు.

Read More : తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ సినిమా

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!