తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ సినిమా

Updated on Aug 23, 2022 06:06 PM IST
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కానుంది
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కానుంది

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ‘లైగర్’. ఇండియాస్‌ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘లైగ‌ర్’ కూడా ఒక‌టి. ఈ చిత్రం ఆగస్టు 25న విడుద‌ల కానుంది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత విజ‌య్ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సంబురాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రంతో విజ‌య్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఇప్పటికే లైగర్ సినిమా నుంచి విడుద‌లైన పాటలు, ట్రైల‌ర్‌లు విప‌రీత‌మైన అంచ‌నాలను క్రియేట్ చేశాయి. మార్షల్ ఆర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో విడుద‌ల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఇదిలా ఉంటే లైగర్ సినిమా విడుద‌ల‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీన రిలీజ్ కానుంది

అడ్వాన్స్‌ బుకింగ్స్‌తోనే..

‘లైగ‌ర్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే రూ.3 కోట్లకుపైగా కలెక్ట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఈ రేంజ్‌లో ఉంటే మొద‌టి రోజు ఖ‌చ్చితంగా డ‌బుల్ డిజిట్ వ‌సూళ్లు చేస్తుందని సినీ విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.85 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. ఈ సినిమాతో విజ‌య్ రూ.100 కోట్ల షేర్‌ను సాధించిన హీరోల లిస్ట్‌లో చేరుతాడో లేదో చూడాలి మరి.

బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన లైగర్‌‌ చిత్రాన్ని పూరి క‌నెక్ట్స్‌, ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్లపై క‌ర‌ణ్‌ జోహార్‌, ఛార్మిల‌తో క‌లిసి పూరీ జ‌గ‌న్నాధ్  తెర‌కెక్కించారు. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టించిన లైగర్ సినిమాలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైస‌న్ కీల‌క‌పాత్రలో న‌టించారు. ఇక ఈ చిత్రంపై బాలీవుడ్‌లో బైకాట్ ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే విజ‌య్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్స్ మాత్రం ఐ స‌పోర్ట్ లైగ‌ర్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

Read More : విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) 'లైగర్‌' సినిమా రన్‌ టైమ్‌ ఎంతో తెలుసా.. సెన్సార్‌ పూర్తి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!