Liger: 'లైగ‌ర్' లైవ్ అప్‌డేట్స్ - విజ‌య్ దేవ‌ర‌కొండ  (Vijay Deverakonda) సినిమాపై ప్రేక్ష‌కుల రివ్యూ

Updated on Aug 25, 2022 10:16 AM IST
Liger: లైగ‌ర్ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)  చాలా శ్ర‌మించార‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.
Liger: లైగ‌ర్ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) చాలా శ్ర‌మించార‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.
ట్విట్ట‌ర్‌లో లైగ‌ర్ హ‌వా

Liger: లైగ‌ర్ సినిమా సోష‌ల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ట్విట్ట‌ర్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది. #BlockbusterLIGER అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. లైగ‌ర్ హ్యాష్ ట్యాగ్ ఇండియాలో మొద‌టి స్థానంలో దూసుకెళుతోంది.

లైగ‌ర్ కోసం జ‌ర్న‌లిస్టు పూజ‌లు

Liger: త‌మిళ‌నాడుకు చెందిన ఓ జ‌ర్న‌లిస్ట్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన లైగ‌ర్ చిత్రం బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కావాల‌ని పత్యేక పూజ‌లు చేయించారు. చెన్నైకి చెందిన జ‌ర్న‌లిస్ట్ రాయ‌ల్ ప్ర‌భాక‌ర్ లైగ‌ర్ హిట్ కావాలంటూ చేసిన పూజ‌లు వైర‌ల్‌గా మారాయి.

అభిమానుల‌తో క‌లిసి సినిమా చూసిన విజ‌య్

Liger: హైద‌రాబాద్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండేలు సంద‌డి చేశారు. ప్రేక్ష‌కుల‌తో క‌లిసి లైగ‌ర్ సినిమాను చూశారు. విజ‌య్‌ను చూసిన‌ అభిమానులు థియేట‌ర్ల‌లో కేరింతలు కొట్టారు. నిన్న‌టివ‌ర‌కు లైగ‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో పాల్గొన్న విజ‌య్, అన‌న్య‌లు ఇప్పుడు సినిమా థియేటర్ల‌ల‌లో ప్రేక్ష‌కుల‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తున్నారు.

Liger: లైగ‌ర్ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)  చాలా శ్ర‌మించార‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.

విజ‌య్‌కు డిజాస్ట‌ర్!

విజ‌య్‌కు డిజాస్ట‌ర్ అంటున్న ఎన్ఆర్ఐలు

అమెరికాలో 'లైగ‌ర్' సినిమా చూసిన ప్రేక్ష‌కులు నెగెటీవ్ రివ్యూలు ఇస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ఫైట్స్ త‌ప్ప సినిమా బాలేదన్నారు. పూరీ ద‌ర్శ‌క‌త్వం కాద‌ని.. ఛార్మీ, క‌ర‌ణ్ జోష‌ర్ డైరెక్ష‌న్ అంటూ కామెంట్స్ చేశారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ సినిమా డిజాస్ట‌ర్ అవుతుంద‌న్నారు. 

రౌడీ హీరో ఫోటోల‌కు పాలాభిషేకాలు

Liger : క‌ర్నూలులో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్లెక్సీకి అత‌ని అభిమానులు పాలాభిషేకాలు చేశారు. లైగ‌ర్ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా థియేట‌ర్ల ముందు సంద‌డి చేశారు ఫ్యాన్స్. విజ‌య్ దేవ‌ర‌కొండ కిక్స్ మొద‌ల‌య్యాయంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

విజ‌య్ హార్డ్ వ‌ర్క్ చేశారు

Liger : విజ‌య్ దేవ‌ర‌కొండ లైగ‌ర్ సినిమాకు చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ని.. అదంతా బుడిద‌లో పోసిన ప‌న్నీరులా అయిందంటూ ఓ నెటీజ‌న్ తెలిపారు. బాలీవుడ్‌పై ఫోక‌స్ పెట్ట‌కుండా తెలుగు సినిమాలు చేయాల‌ని సూచించారు. తెలుగు సినిమాలు చేస్తే అవే పాన్ ఇండియా సినిమాలుగా గుర్తింపు తెస్తాయ‌న్నారు. 

లైగ‌ర్ సంబురాలు

Liger: పాన్ ఇండియా సినిమాగా లైగ‌ర్ సినిమా రిలీజ్ అయింది. విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానులు ప‌లు చోట్ల సంద‌డి చేశారు. హైద‌రాబాద్‌లో థియేట‌ర్ల ముందు రౌడీ హీరో ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. తీన్ మార్ డాన్సుల‌తో హోరెత్తించారు. 

Liger: లైగ‌ర్ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)  చాలా శ్ర‌మించార‌ని ప్రేక్ష‌కులు అంటున్నారు.

Liger: టాలీవుడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda) న‌టించిన పాన్ ఇండియా సినిమా 'లైగ‌ర్'  ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాల‌తో విడుద‌లైంది. తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ, మ‌ల‌యాళం భాష‌ల్లో 'లైగ‌ర్' సినిమా రిలీజ్ అయింది. హిందీ వ‌ర్ష‌న్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ కానుంది.  ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే హీరో హీరోయిన్లుగా న‌టించారు.  పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ చిత్రం తెర‌కెక్కింది. భారీ బ‌డ్జెట్‌తో బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్, హీరోయిన్ ఛార్మీకౌర్ ఈ సినిమాను నిర్మించారు.