శింబు (Simbu) నోట మరో తెలుగు పాట.. నిఖిల్ (Nikhil Siddharth) కోసం ‘టైమ్ ఇవ్వు పిల్ల’ అంటున్న స్టార్ హీరో

Updated on Nov 26, 2022 07:10 PM IST
‘కార్తికేయ’ తర్వాత వస్తున్న ‘18 పేజెస్’ చిత్రంతో నిఖిల్ (Nikhil Siddharth) ఇంకెంత పెద్ద హిట్టు కొడతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది
‘కార్తికేయ’ తర్వాత వస్తున్న ‘18 పేజెస్’ చిత్రంతో నిఖిల్ (Nikhil Siddharth) ఇంకెంత పెద్ద హిట్టు కొడతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది

కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘వల్లభ’, ‘మన్మథ’ లాంటి చిత్రాలతో తెలుగులోనూ ఆయన ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు. శింబు మూవీల కోసం ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది ఇక్కడా ఉన్నారు. యూత్‌ఫుల్ కాన్సెప్టులతో సినిమాలు చేస్తూ యువతకు చేరువైన శింబులో మంచి గాయకుడు కూడా ఉన్నారు. ఆయనకు పాటలు పాడటం కొత్తేమీ కాదు. 

టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌తోపాటు మరికొంత మంది హీరోల సినిమాలకు శింబు సాంగ్స్ పాడి మెప్పించారు. ఇప్పుడు మరో యంగ్ హీరో కోసం ఆయన గొంతు సవరించుకోనున్నారట. ‘కార్తికేయ’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) ప్రస్తుతం చేస్తున్న చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ సుకుమార్ కథను అందిస్తున్నారు. ఆయన శిష్యుడు, ‘కుమారి 21ఎఫ్’ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘నన్నయ్య రాసిన’ అనే పాట విడుదలైంది. ఈ మెలోడీ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. 

తమిళ స్టార్ హీరో శింబుతో ‘18 పేజెస్’ చిత్రంలో ఓ పాట పాడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు

ఇదిలాఉండగా తమిళ స్టార్ హీరో శింబుతో ‘18 పేజెస్’ చిత్రంలో ఓ పాట పాడించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలో ఆయన పాడిన పాటను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ‘టైమ్ ఇవ్వు పిల్ల టైమ్ ఇవ్వు’ అంటూ ఈ పాట సాగుతుందట. ఇకపోతే, ‘18 పేజెస్’ మూవీ డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నిఖిల్ సరసన స్టార్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మరోమారు నటిస్తున్నారు. ‘కార్తికేయ’ బ్లాక్‌బస్టర్ కావడంతో జోష్‌లో ఉన్న నిఖిల్.. ఈ సినిమాతో ఇంకెంత పెద్ద హిట్టు కొడతారో చూడాలి.  

Read more: Sreeleela: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన యంగ్ బ్యూటీ శ్రీలీల!.. ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌కు జోడీగా నటించే చాన్స్?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!