నిఖిల్ (Nikhil) హీరోగా నటిస్తున్న ‘18 పేజెస్’ సినిమా రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్

Updated on Oct 27, 2022 04:10 PM IST
నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.
నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

కార్తికేయ2 సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్‌తో జోష్‌లో ఉన్నారు యంగ్ హీరో నిఖిల్ (Nikhil Siddhartha). పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన కార్తికేయ2 నిఖిల్‌కు పాన్‌ ఇండియా స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

కార్తికేయ2 తర్వాత నిఖిల్ నటిస్తున్న సినిమా 18 పేజెస్. నిఖిల్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ మరోసారి హీరోయిన్‌గా నటిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరింది. ప్రస్తుతం హీరో నిఖిల్‌ కూడా సెట్స్‌లో జాయిన్‌ అయ్యారు. కార్తికేయ2 సినిమాకు వచ్చిన క్రేజ్‌తో నిఖిల్ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

వైరల్ అవుతున్న ఫోటో..

ఈ క్రమంలో 18 పేజెస్ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ట్విట్టర్ వేదికగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. డిసెంబర్‌‌ 23వ తేదీన 18 పేజెస్ సినిమాను గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా సెట్స్‌లో చిత్ర యూనిట్‌తో నిఖిల్‌ దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్ వైరల్ అవుతోంది. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న 18 పేజెస్ సినిమా గీతా ఆర్ట్స్‌2, సుకుమార్‌‌ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. 

18 పేజెస్‌ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన కార్తికేయ2 సినిమా విడుదలై బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా కార్తికేయ3 తెరకెక్కించనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీని గురించిన పూర్తి వివరాలు తెలియాలంటే దర్శకుడు చందు మొండేటి నుంచి అప్‌డేట్‌ రావాల్సిందే. అయితే కార్తికేయ3 సినిమా తప్పకుండా తెరకెక్కుతుందని హీరో నిఖిల్ (Nikhil Siddhartha) ఇప్పటికే స్పష్టం చేశారు.  

Read More : చరిత్ర సృష్టించేలా నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన 'కార్తికేయ 2' సినిమా కలెక్షన్లు !

నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

నిఖిల్ (Nikhil) హీరోగా నటించిన కార్తికేయ2 సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!