Nayanthara & Vignesh Shivan : నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతుల హనీమూన్ ట్రిప్ చిత్రాలు .. సోషల్ మీడియాలో వైరల్

Updated on Jun 23, 2022 07:55 PM IST
నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌లు జూన్ 9 వ తేదిన మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే
నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌లు జూన్ 9 వ తేదిన మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే

నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్.. ప్రస్తుతం సెలబ్రిటీ కపుల్‌గా వీరు సినీ ఇండస్ట్రీలో తమదైన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే మహాబలిపురంలో పెళ్లి చేసుకున్న ఈ జంట, తాజాగా థాయిలాండ్‌కు హనీమూన్ కోసం వెళ్లారు. అక్కడి నుండి ఎప్పటికప్పుడు తమ ఫోటోలను వివిధ సోషల్ మీడియా వేదికలలో షేర్ చేస్తున్నారు. 

బుధవారం నాడు, తన భార్య నయనతారతో కలిసి విఘ్నేష్ థాయిలాండ్‌లో రెండు సెల్ఫీలు తీసుకున్నాడు. అన్ వ్రాప్ ది వరల్డ్, వెకేషన్, అన్ వ్రాప్ థాయిలాండ్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ వాడుతూ.. ఈ జంట ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికలలో తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేశారు. అలాగే తమ సెల్ఫీలను కూడా పోస్టు చేశారు.  

నయనతార (Nayanthara), విఘ్నేశ్ శివన్‌లు థాయిలాండ్ రాజధాని బ్యాంకాంక్ ప్రాంతంలో గల ది సియామ్ హోటల్‌లో బసకు దిగారు. ఈ అర్బన్ లగ్జరీ రిసార్ట్ చావో ప్రాయా అనే నదీ తీరంలో ఉందట. అక్కడ నుండే నయన్ దంపతులు తమ సెల్ఫీలను, ఫోటోలను పోస్టు చేయడం ప్రారంభించారు. 

నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌లు జూన్ 9 వ తేదిన మహాబలిపురంలోని ఓ ప్రైవేట్ రిసార్టులో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ పెళ్లికి షారుఖ్ ఖాన్, సూర్య, జ్యోతిక, అట్లీ మొదలైన ప్రముఖ సినీ దిగ్గజాలంతా హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ పెండ్లి కార్యక్రమాన్ని తన చేతుల మీదుగా జరిపించారు. 

నయనతార (Nayanthara) వివాహం జరిగిన రోజు నుండీ ప్రతీ రోజూ ఆమె గురించి లేటెస్ట్ అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. తమ పెళ్లి వేడుకలను పురస్కరించుకొని నయన్ దంపతులు లక్షమంది అనాథలకు అన్నదానం చేశారు. అలాగే తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించకున్నారు. ఆ తర్వాత కేరళ వెళ్లి తమ ఫేవరెట్ రెస్టారెంటులో అరేబియన్ ఫుడ్‌ను ఆరగించారు. 

ఇటీవలే నయనతార (Nayanthara) O2 అనే చిత్రంలో నటించారు. అలాగే చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. మలయాళం చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా గాడ్ ఫాదర్ చిత్రం తెరకెక్కుతుందన్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 

నయనతార (Nayanthara) గతంలో తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు. ముఖ్యంగా దుబాయ్ శీను, లక్ష్మీ, శ్రీరామ రాజ్యం, సింహా లాంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ముఖ్యంగా శ్రీరామరాజ్యంలోని సీతాదేవి పాత్రలో నయన్ ఒదిగిపోయారు. అలాగే కర్తవ్యం, అమ్మోరు తల్లి లాంటి డబ్బింగ్ సినిమాలకు కూడా నయనతారకు తెలుగు ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే పడ్డాయి. 

ఇక నయనతార భర్త విఘ్నేశ్ శివన్ కూడా అజిత్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రొడక్షన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. ఈ సంవత్సరమే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. నయనతార నటించిన సినిమాలకు కూడా గతంలో విఘ్నేశ్ దర్శకత్వం వహించారు. 

Read More: అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మైన‌ న‌య‌న్, విఘ్నేష్‌ల‌ జంట‌

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!