Nayanthara & Priyanka Chopra : నయనతార వర్సెస్ ప్రియాంక చోప్రా.. పెళ్లి కూతురిగా ఎవరి గెటప్ అదిరిపోయింది ?

Updated on Jun 22, 2022 02:49 PM IST
నయనతార (Nayanthara) ఈ పెళ్లిలో ఎరుపు రంగు చీరలో అందాల బొమ్మగా కనిపిస్తుందని, ఆమె ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.
నయనతార (Nayanthara) ఈ పెళ్లిలో ఎరుపు రంగు చీరలో అందాల బొమ్మగా కనిపిస్తుందని, ఆమె ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఇటీవలే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ని వివాహమాడిన సంగతి తెలిసిందే. జూన్ 9 తేదిన ఈ జంట దంపతులుగా ఒక్కటయ్యారు.

షారుఖ్ ఖాన్, డైరెక్టర్ అట్లీ, అజిత్, దళపతి విజయ్, సూర్య, జ్యోతిక లాంటి పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఈ ఫంక్షన్‌కు హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా దగ్గరుండి ఈ పెళ్లి జరిపించారు. 

నయనతార (Nayanthara) ఈ పెళ్లిలో ఎరుపు రంగు చీరలో అందాల బొమ్మగా కనిపిస్తుందని, ఆమె ఫ్యాన్స్ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం.

ఈమె వెడ్డింగ్ స్టైల్ ప్రియాంక చోప్రాని పోలి ఉందని కూడా కొందరు కామెంట్స్ చేశారు. ఎందుకంటే ప్రియాంక కూడా తన వెడ్డింగ్‌కు పెళ్లి కూతురిగా ముస్తాబైనప్పుడు ఎరుపు రంగు లెహంగానే ధరించిందట. 

 

నయనతార డిజైన్ చాలా స్పెషల్

నయనతార (Nayanthara)  పెళ్లి చీరను మోనికా షా అనే ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇది ఓ కస్టమ్ డిజైన్డ్ శారీ. ఇక ప్రియాంక చోప్రా పెళ్లికి లెహంగాని డిజైన్ చేసిన వ్యక్తి సబ్యసాచి. హ్యాండ్ కట్ ఆర్గాంజా ఫ్లవర్స్‌ను ఉపయోగిస్తూ, త్రెడ్ వర్క్ పద్ధతిలో ప్రియాంక లెహంగాను సబ్యసాచి డిజైన్ చేయడం విశేషం. 

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) విషయానికి వస్తే, ఆమె పెళ్లి సందర్బంగా తన వెయిస్ట్ బ్యాండ్ పై ఆమెతో పాటు ఆమె ప్రియుడు నిక్ జోన్స్ పేరు కూడా ప్రింట్ అయ్యేలా డిజైనర్ శ్రద్ధ తీసుకోవడంతో.. ఆ వెడ్డింగ్ కాస్ట్యూమ్ బాగా వైరల్ అయ్యింది.

అదే కాస్ట్యూమ్ అనేక లేటెస్ట్ కాస్ట్యూమ్స్‌కు కూడా ప్రేరణగా నిలిచింది. ఈ కాస్ట్యూమ్‌కి తోడు 84.5 క్యారెట్ల డైమండ్ సెట్, చెవి దుద్దులు, వజ్రాల ముక్కుపుడక ఇవి ఇన్నీ ప్రియాంక అందాన్ని ద్విగుణీకృతం చేశాయి.

సంప్రదాయానికే పెద్ద పీట

నయనతార (Nayanthara) కూడా ప్రియాంకకు తక్కువేం కాదండోయ్ ! ఎర్రటి చీరతో పాటు సంప్రదాయమైన నగలు, గాజులు, ఖరీదైన రాళ్లు పొదిగిన నెక్లెస్, పాపిట బిళ్ళ, ముత్యాల హారాలతో .. అచ్చమైన దక్షిణాది రాకుమారిలా సౌత్ ఇండియన్ కాస్ట్యూమ్‌లో నయనతార చూపరులను బాగానే ఆకట్టుకుంది. 

ఏదేమైనా, ఈ ఇద్దరు నటీమణులు వారి వారి సంప్రదాయాలను అనుసరించి వెడ్డింగ్ కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయించుకున్నారు. అంతే కాదు, ఆయా కాస్ట్యూమ్స్‌లో కుందనపు బొమ్మల్లా మెరిసిపోతున్నారు కూడా. కనుక ఎవరి డ్రెసింగ్ స్టైల్ బాగుంది? అని చర్చించడం ఇక్కడ అప్రస్తుతమే. 

ఇద్దరూ తెలుగు వారికి సుపరిచితమే

ప్రియాంక చోప్రా (Priyanka Chopra) బాలీవుడ్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించిన కథానాయిక. జంజీర్ చిత్రంలో ఈమె రామ్ చరణ్ సరసన కథానాయికగా కూడా నటించింది. ఇదే చిత్రం 'తుఫాన్'పేరుతో తెలుగులో రిలీజ్ కాగా, ఆ విధంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ప్రియాంక దగ్గరైంది. 

ఇక నయనతార (Nayanthara) విషయానికి వస్తే, టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలు అందరితోనూ ఆమె నటించింది. శ్రీరామరాజ్యం, లక్ష్మీ, దుబాయ్ శీను, సింహా లాంటి సినిమాలు ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. కర్తవ్యం, అమ్మోరు తల్లి లాంటి డబ్బింగ్ సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నయనతార. 

Read More: తాళి కట్టు శుభవేళ : నయనతార (Nayanthara) మెడలో విఘ్నేశ్.. మూడు ముళ్లు వేస్తున్న ఫోటో వైరల్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!