Nayanthara: పెళ్లి తర్వాత నయన్, విఘ్నేష్ హవా మామూలుగా లేదుగా.. కోట్లు ఖరీదు గల ఇల్లు కొనుగోలు చేసిన జంట!

Updated on Jul 06, 2022 11:28 PM IST
నయన్, విఘ్నేశ్ జంట (Nayanthara, Vignesh Shivan Couple)
నయన్, విఘ్నేశ్ జంట (Nayanthara, Vignesh Shivan Couple)

సౌత్ లేడీ సూపర్ స్టార్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ నయనతార (Nayanathara) ఇటీవలే, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

మహాబలిపురంలోని గ్రాండ్ షెరటాన్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం నయన్–విఘ్నేష్‌లు ఒక్కట‌య్యారు. వివాహం అనంత‌రం ప‌లు పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించిన ఈ నూతన జంట‌.. ఆ పై బ్యాంకాక్‌లో హ‌నీమూన్‌ను ఎంజాయ్ చేసి వ‌చ్చారు. కాగా, వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. 

వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న నయన్-విఘ్నేశ్ (Vighnesh Shivan) జంట, ప్రస్తుతం ఎవరి సినిమా పనులలో వారు బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో తన పర్సనల్ లైఫ్‌ పై.. సినిమాల ప్రభావం పడకుండా, తన కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది నయనతార. అలాగే, ఈ జంట మ‌రోవైపు కొత్త కాపురానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. 

ఇందులో భాగంగానే న‌య‌న్ (Nayanathara) చెన్నై పోయెస్‌గార్డెన్‌లో ఏకంగా రెండు ఇళ్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇల్లు దాదాపు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి ఉంది. ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్, లిఫ్ట్ వంటి అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ ఇల్లు కొన్ని కోట్ల ఖరీదు చేస్తుందని సమాచారం.

అందులో ఇంటీరియర్ డిజైన్ కోసమే ఏకంగా రూ. 25కోట్లు ఖర్చుచేసిందట నయన్. పూర్తిగా ఆ ఇంటిని తన భర్త పేరుమీదే కొనుగోలు చేసిందని టాక్. ఈ విధంగా ఇంటీరియర్ డిజైన్ కోసం ఈ స్థాయిలో ఖర్చు పెడుతున్నారంటేనే, ఈమె రేంజ్ ఏంటో అర్థమవుతోంది.  

కాగా, పోయెస్ గార్డెన్‌లో ఎక్కువగా సెలబ్రిటీస్ ఉంటారు. రజనీకాంత్ (Rajinikanth) లాంటి నటులు ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు. అలాగే జయలలిత, శశికళ (Shashikala).. ఇంకా కొంతమంది రాజకీయ ప్రముఖులు ఇక్కడే ఖరీదైన బంగ్లాలలో ఉండేవారు. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు నయనతార కూడా వచ్చి చేరింది. ఈ గార్డెన్‌లో కొనుగోలు చేసిన ఇంటిలో నయన్, ఒక స్విమ్మింగ్ పూల్‌ను కూడా ప్రత్యేకించి నిర్మించుకుందట. త్వరలోనే తన భర్తతో ఆ బంగ్లాలో ఆమె గృహప్రవేశం చేయబోతోంది. 

నయనతార సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ (Shah Rukh Khan) సరసన 'జవాన్' అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాతో ఈమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోంది.  ఈ సినిమా ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

Read More: Nayanthara & Vignesh Shivan: పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార, విఘ్నేశ్‌ల ఫ్యాన్ ఫాలోయింగ్ మ‌రింత పెరిగింద‌ట‌!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!