Nayanthara Wedding: న‌య‌న‌తార‌ వివాహ ఆహ్వాన ప‌త్రికలో ఓ ప్ర‌త్యేక‌త‌ ఉంది.. అదేంటంటే..?

Updated on Jun 08, 2022 01:19 PM IST
Nayanthara Wedding: న‌య‌న‌తార‌,  విఘ్నేష్‌ పెళ్లికి వ‌చ్చే  అతిథులను ఓ విషయం ఆశ్చర్యపరుస్తోంది.  'మీరందరూ సాంప్ర‌దాయ దుస్తుల్లో వ‌స్తార‌ని ఆశిస్తున్నాం' అనే ట్యాగ్ లైన్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.
Nayanthara Wedding: న‌య‌న‌తార‌, విఘ్నేష్‌ పెళ్లికి వ‌చ్చే అతిథులను ఓ విషయం ఆశ్చర్యపరుస్తోంది. 'మీరందరూ సాంప్ర‌దాయ దుస్తుల్లో వ‌స్తార‌ని ఆశిస్తున్నాం' అనే ట్యాగ్ లైన్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

Nayanthara :  నయనతార.. దక్షిణాది సినీ ప్రేమికులకు బాగా పరిచయమైన పేరు. శ్రీ రామ రాజ్యం, లక్ష్మి, అదుర్స్, దుబాయ్ శీను, తులసి, బిల్లా, సైరా నరసింహారెడ్డి లాంటి సినిమాలు ఈమెకు తెలుగులో మంచి పేరు తీసుకొచ్చాయి. మాయ, తని ఒరువన్, నానుమ్ రౌడీ దాన్, ఐరా, రాజా రాణి లాంటి తమిళ చిత్రాలు.. ఆమెను కోలీవుడ్‌ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.

నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. తమ నిశ్చితార్థం కూడా అయిపోయిందని, ఈ జంట ఓ సారి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు నయనతార, విఘ్నేష్ శివన్‌లు నిజంగానే ఆలుమగలు అవుతున్నారు. కళ్యాణ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

Nayanthara : హీరోయిన్ నయనతార, ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివ‌న్‌ల వివాహ వేడుక కొద్ది గంట‌ల్లో అంగరంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అందిస్తున్న, వీరిద్ద‌రి పెళ్లి అప్‌డేట్స్ వారి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

ఏడేళ్ల ప్రేమ‌ను న‌య‌న్, విఘ్నేష్‌లు వందేళ్ల పెళ్లి బంధంగా మార్చుకుంటున్నారు. మూడు ముళ్ల బంధంతో ఒక‌టి కాబోతున్న, వీరి పెళ్లి  ప‌త్రిక సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది. త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో జూన్ 9 న  వీరి మ్యారేజ్ జ‌ర‌గ‌నుంది. ఈ పెళ్లి వేడుక‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ నాయ‌కులు కూడా హాజ‌రుకానున్నారు.

న‌య‌న‌తార‌ వివాహ పత్రికలోని ప్ర‌త్యేక‌త ఇదే !

న‌య‌న‌తార‌, విఘ్నేష్‌ల పెళ్లికి సంబంధించిన డిజిట‌ల్ ఇన్విటేష‌న్, ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ జంట ఆదిదేవుడైన వినాయ‌కుడి బొమ్మను, త‌మ పెళ్లి కార్డులో ముఖ చిత్రంగా ప్రింట్ చేయించారు. 'దేవుడు, పెద్ద‌లు, విశ్వం '.. వీరి ఆశీర్వాదంతోనే తాము పెళ్లి చేసుకుంటున్నామ‌ని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

కురియ‌న్ కోడియ‌ట్టు, ఓమ‌న కురియ‌న్ కుమార్తె న‌య‌న‌తార‌ను.. శివ కొలుండు,  మీనా కుమారీల కుమారుడు విఘ్నేష్ శివ‌న్‌కు ఇచ్చి జూన్ 9 న వివాహం జ‌రిపిస్తున్నామంటూ, ఆహ్వాన ప‌త్రిక‌లో ప్రచురించారు.

చెన్నైలోని మ‌హాబ‌లిపురం వేదికగా వివాహం జరగనుందని తెలిపారు . ఇక 'పెళ్లికి వ‌చ్చే వారు సాంప్ర‌దాయ దుస్తుల్లో తప్పక వ‌స్తార‌ని ఆశిస్తున్నాం ' అనే ట్యాగ్ లైన్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఆహ్వానం

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్‌ను న‌య‌న‌తార‌, విఘ్నేష్‌లు త‌మ వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. స్టాలిన్  కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా సినీ రంగంలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఉద‌య‌నిధి హీరోగా ఎన్నో సినిమాల్లో న‌టించారు. నిర్మాత‌గా కూడా పలు చిత్రాల‌ను నిర్మించారు. ప్ర‌స్తుతం తన తండ్రి బాటలోనే రాజకీయ రంగంలోకి కూడా ప్రవేశించారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు.

ఉద‌య‌నిధి, న‌య‌న‌తార (Nayantara) జంట‌గా ఎన్నో సినిమాలు చేశారు. న‌య‌న‌తార త‌న పెళ్లికి ఉద‌య‌నిధితో పాటు, ఆయన తండ్రి సీఎం స్టాలిన్‌కు కూడా ప్ర‌త్యేక ఆహ్వానాన్ని అందించారు. 

ఓటీటీలో పెళ్లి డాక్యుమెంటరీ

Nayanthara: నయనతార, విఘ్నేశ్‌ల పెళ్లి వేడుకను ద‌ర్శ‌కుడు గౌతమ్ మీనన్ డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తున్నారట. ఈ క్రమంలో వివాహ వేడుక‌కు సంబంధించి, ఇప్ప‌టికే ఓ ప్రివ్యూ షూట్ కూడా జ‌రిపారు. ఈ పెళ్లి డాక్యుమెంటరీని ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్‌లో ప్రసారం చేయ‌నున్నారని టాక్. 

రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి, సూర్య, అజిత్, కార్తీ, విజయ్ సేతుపతి, స‌మంత.. ఇలా పలువురు సౌత్ సినీ సెల‌బ్రిటీలు న‌య‌న‌తార రిసెప్ష‌న్ వేడుక‌కు హాజ‌రుకానున్నారు.

Read More:నయన్, విఘ్నేష్‌ల పెళ్లిసంద‌డి షురూ ! మన 'దక్షిణాది బ్యూటీ' మిసెస్‌గా ఎప్పుడు కనిపిస్తారంటే ?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!