ఆరేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నామంటున్న నయనతార (Nayanathara) దంపతులు.. సరోగసి వివాదంలో ఊహించని ట్విస్ట్..!
సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara), విఘ్నేశ్ శివన్ దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లయిన నాలుగు నెలలకే మాకు కవల పిల్లలు పుట్టారు అని అధికారికంగా ప్రకటించారు. దీంతో కొంతమంది ఆశ్చర్యపోతుంటే, మరికొంతమంది ఎలా పుట్టారు అని ఆరా తీస్తున్నారు. అయితే.. నయన్, విఘ్నేష్ ప్రకటించినప్పటి నుంచి పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు చెప్పాలని వీరికి నోటీసులు పంపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జూన్ 9న నయనతార, విఘ్నేష్‌లకు (Vignesh Shivan) వివాహం జరిగింది. సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యినట్లయితే పెళ్లికి ముందే కొన్నేళ్లుగా వారు రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అసలు నయనతారకు గర్భం వచ్చినట్టు కూడా తెలియలేదు. అసలు ఏం జరిగింది అని అంతా అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కవల పిల్లలు ఎలా పుట్టారనే విషయంపై వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం.సుబ్రహ్మణ్యం నోటీసులు జారీ చేశారు.
మనదేశంలో సరోగసి (Surrogacy) బ్యాన్ అయింది.. జనవరి 2022 నుంచి ఇక్కడ అద్దె గర్భం మోయాలి అంటే కచ్చితంగా దానికి తగిన కారణాలు ఉండాలి. చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఈ పద్దతిని ఎంచుకోవాలి, అంతే కాక మరిన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అతిక్రమించి ఇల్లీగల్ గా సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించినట్టు రుజువైతే ఇందుకు బాధ్యులైనవారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.
మరి తమిళనాడు ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు నయనతార (Nayanathara) దంపతులు వివరణ ఇస్తారా? లేక శిక్షార్హులు అవుతారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. తాము ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని కమిటీకి సమర్పించిన అఫిడవిట్‌లో నయనతార దంపతులు పేర్కొన్నట్లు తెలుస్తోంది.
దీంతో ఆరేళ్ల క్రితమే నయన్-విఘ్నేష్ (Nayanathara-Vignesh Shivan) పెళ్లి జరిగిందని అభిమానులు సైతం షాక్ కి గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో తమకు పెళ్లి ఆరేళ్లయినా పిల్లలు పుట్టలేదు కాబట్టే తాము అద్దెగర్భం ద్వారా ముందుకు వెళ్లామని ఈ జంట చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు యూఏఈలో ఉన్న తన బంధువు ద్వారా సరోగసి పద్ధతిలో పిల్లల్ని పొందినట్లు నయనతార స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి నయన్ అందించిన ఆధారాలతో విమర్శకులకు, సరోగసి వివాదానికి చెక్ పెట్టినట్లైంది.
Read More: కవల పిల్లలకు తల్లిదండ్రులైన విఘ్నేష్ శివన్-నయనతార (Vignesh Shivan-Nayanathara) జంట.. ఫొటోలు వైరల్!