Nayanthara: నయనతార, విఘ్నేష్ శివన్‌ల కళ్యాణ వేడుకను ఓటీటీలో చూసేద్దామా.. ఇది నిజమేనా?
టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ పరిశ్రమలో కూడా పేరెన్నిక గల నటి నయనతార (Nayanthara). ఇటీవలే దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ఈమె పెళ్ళి నిశ్చయమైంది. 9 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట, కొన్నాళ్లు డేటింగ్ కూడా చేసి, ఇప్పుడు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
తాజాగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వీరి పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించి, ఓటీటీ ద్వారా టెలికాస్ట్ చేయడానికి, కొందరు నిర్మాతలు ముందుకొచ్చారట. నెట్ ఫ్లిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని, ఈ ప్రాజెక్టును వారు టేకప్ చేశారట. ఒకవేళ, ఈ వార్తే గనుక నిజమైతే, నయన్ ఫ్యాన్స్‌కు పండగే కదా మరి.
నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ రైట్స్‌కు అంత మొత్తమా?
ఈ వార్త ఇలా సోషల్ మీడియాలో హల్చల్ చేసిందో లేదో, నయనతార పెళ్లికి సంబంధించి మరిన్ని వార్తలను పలు పత్రికలు పోస్టు చేయడం ప్రారంభించాయి. నయనతార (Nayanthara) ఈ వెడ్డింగ్ డాక్యుమెంటరీని తెరకెక్కించేందుకు అనుమతిని మంజూరు చేయాలంటే, రూ.4 కోట్ల నుండి 5 కోట్ల వరకూ డిమాండ్ చేశారని పలు వెబ్ సైట్స్ కథనాలు వ్రాశాయి.
ఇక దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ డాక్యుమెంటరీని తెరకెక్కిస్తున్నారని ఓ టాక్ నడుస్తోంది. ఏదేమైనా, నయనతార వెడ్డింగ్ నెటిజన్లలో మంచి ఆసక్తిని కలిగిస్తోందనేది మాత్రం నిజం. ఇటీవలే నయనతార (Nayanthara), విఘ్నేష్ శివన్‌ల జంట తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను కలిసి మరీ వెడ్డింగ్ ఇన్విటేషన్‌ను అందించారు. అలాగే ఈ జంట ఎక్కడికి వెళ్లినా, సాధ్యమైనంతవరకూ సంప్రదాయ దుస్తులనే ధరించడం విశేషం.
మహాబలిపురం వేదికగా నయన్ కళ్యాణం
తొలుత నయనతార వివాహం, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. అయితే, ఈ జంట మహాబలిపురం వేదికగా తమ పెళ్లిని జరుపుకోనున్నట్లు తెలిపాయి. అయితే ఈ వివాహ కార్యక్రమానికి చాలా కొద్దిమందినే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వివాహం జరిగాక మాత్రం, రిసెప్షన్‌ను తమ సన్నిహితుల కోసం చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తున్నరని వినికిడి.
నయనతార, విఘ్నేష్ శివన్‌లు తొలిసారిగా 2015 లో "నానుమ్ రౌడీ దాన్" సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డారు. మార్చి 25, 2021 న వీరి నిశ్చితార్థం జరిగింది.