సరోగసి (Surrogacy) ద్వారా కవలపిల్లలకు తల్లి కావడంతో చిక్కుల్లో పడ్డ నయనతార (Nayanathara-Vignesh) దంపతులు!
సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara), విఘ్నేశ్ శివన్ దంపతులకు ఇటీవల కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లయిన నాలుగు నెలలకే మాకు కవల పిల్లలు పుట్టారు అని అధికారికంగా ప్రకటించారు. దీంతో కొంతమంది ఆశ్చర్యపోతుంటే, మరికొంతమంది ఎలా పుట్టారు అని ఆరా తీస్తున్నారు. అయితే.. నయన్, విఘ్నేష్ ప్రకటించినప్పటి నుంచి పలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం పిల్లలు ఎలా పుట్టారో వివరాలు చెప్పాలని వీరికి నోటీసులు పంపించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది జూన్ 9న నయనతార, విఘ్నేష్‌లకు (Vignesh Shivan) వివాహం జరిగింది. సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యినట్లయితే పెళ్లికి ముందే కొన్నేళ్లుగా వారు రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే. అసలు నయనతారకు గర్భం వచ్చినట్టు కూడా తెలియలేదు. అసలు ఏం జరిగింది అని అంతా అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కవల పిల్లలు ఎలా పుట్టారనే విషయంపై వివరాలు ఇవ్వాలని ఈ దంపతులను తమిళనాడు వైద్య, ప్రజా సంక్షేమ శాఖ మంత్రి ఎం.సుబ్ర్మణ్యం నోటీసులు జారీ చేశారు.
మనదేశంలో సరోగసి (Surrogacy) బ్యాన్ అయింది.. జనవరి 2022 నుంచి ఇక్కడ అద్దె గర్భం మోయాలి అంటే కచ్చితంగా దానికి తగిన కారణాలు ఉండాలి. చట్టం ప్రకారం పెళ్లయిన ఐదు సంవత్సరాల వరకు కూడా పిల్లలు పుట్టకపోతే అప్పుడు ఈ పద్దతిని ఎంచుకోవాలి, అంతే కాక మరిన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ అతిక్రమించి ఇల్లీగల్ గా సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టించినట్టు రుజువైతే ఇందుకు బాధ్యులైనవారికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.
మరి తమిళనాడు ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు నయనతార (Nayanathara-Vignesh Shivan) దంపతులు వివరణ ఇస్తారా? లేక శిక్షార్హులు అవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు నయన్ దంపతులు మాత్రం స్పందించలేదు. వీటన్నింటికీ నయన్ తన సన్నిహితులతో ఒకే ఒక రియాక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ నాకు చాలా పని ఉంది.. జరిగే ప్రతి కాంట్రవర్సీ నా మూలంగా కాదు.. ఒకవేళ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తే దానికి స్పందించాల్సిన అవసరం నాకు లేదని సన్నిహితులతో నయన్ చెప్పినట్టు తెలుస్తోంది.
Read More: కవల పిల్లలకు తల్లిదండ్రులైన విఘ్నేష్ శివన్-నయనతార (Vignesh Shivan-Nayanathara) జంట.. ఫొటోలు వైరల్!