Nayanthara Wedding: అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన నయన్, విఘ్నేష్‌ల జంట
లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanathara) పెళ్లి వేడుక మరో మూడు రోజుల్లో ఉంది. నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. వీరిద్దరూ గతకొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ ఏడాది జూన్ 9న వివాహం చేసుకోనున్నారు. తమిళనాడులోని మహాబలిపురంలో నయన్, విఘ్నేష్‌ల పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ రిసెప్షన్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలి రానున్నారు. పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యాక నయనతార, విఘ్నేష్ శివన్‌లు పలుమార్లు దైవ దర్శనాలు చేసుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పత్రికలు పంచారు. ఇక ఇప్పుడు మెహందీ, హల్దీ వేడుకలకు సిద్ధమయ్యారు.
9 ఏళ్ల క్రితమే ప్రేమలో పడిన నయన్ .. ముందే పెళ్లి అయిపోయిందంటూ ప్రచారం
నయనతార సౌత్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ కూడా స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇద్దరూ సక్సెస్ ఫుల్ లైఫ్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అసలు వీరికి ఎప్పుడో పెళ్లి అయిందనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచుతున్నారంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే తమకు ఇంకా పెళ్లి కాలేదని.. ఎంగేజ్‌మెంట్ మాత్రం అయిందంటూ ఈ జంట అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఉంగరాలు కూడా మార్చుకున్నామంటూ ఫోటోలు షేర్ చేశారు. ఇక తమ పెళ్లి ఎప్పుడో అందరికీ చెప్పే చేసుకుంటామన్నారు నయన్, విఘ్నేష్‌లు.
దైవ దర్శనాలకు నయన్, విక్కీ జంట
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానంలో నయనతార (Nayanathara), విఘ్నేష్‌లు తమ మొదటి పెళ్లి కార్డును ఉంచారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత షిర్డీ వెళ్లారు. సాయిబాబా దర్శనం చేసుకున్నారు. తమిళనాడులోని శ్రీరంగనాథుడిని దర్శించుకున్నారు. విఘ్నేష్ కులదైవం అయిన అమ్మవారి దగ్గర పాలు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇలా పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత ఇద్దరూ దేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికి పలు ఆలయాలను సందర్శించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు.
పెళ్లి పత్రికలను స్వయంగా పంచుతున్నారు
తమ వివాహానికి వీఐపీలను నయన్, విఘ్నేష్‌లు ఆహ్వానించారు. ఇప్పటికే కొంతమంది అతిథులకు డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్‌ని పంపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను నయనతార, విఘ్నేష్‌లు తమ వివాహానికి ఆహ్వానించారు. సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. నిర్మాతగా కూడా చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఉదయనిధి రాజకీయాల్లోకి వెళ్లారు. ఎమ్మెల్యేగా ఉదయనిధి తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఉదయనిధి, నయనతార (Nayanthara) జంటగా ఎన్నో సినిమాలు చేశారు. నయనతార (Nayanathara) తన పెళ్లికి ఉదయనిధితో పాటు అతని తండ్రి సీఎం స్టాలిన్‌కు కూడా ప్రత్యేక ఆహ్వానం అందించారు.
పలువురు ప్రముఖులకు అందిన ఆహ్వానాలు
నయన్ (Nayanathara), శివన్ వివాహా రిసెప్షన్‌కు సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరవనున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, చిరంజీవి, సమంత, సూర్య, కార్తీ, శివ కార్తికేయన్, విజయ్ సేతుపతి వంటి సినీ ప్రముఖులను ఈ వివాహ వేడుకకు ఆహ్వానించారట. అలాగే పలు రాజకీయ నేతలు కూడా ఈ పెళ్లికి హాజరుకానున్నారు.
పెళ్లి వేడుక లైవ్ కోసం స్పెషల్ ప్లాన్.
నయనతార తన పెళ్లి వేడుక హక్కుల్ని ఓ ఓటీటీకి అమ్మారట. పెళ్లి వేడుక స్ట్రీమింగ్ చేయడం కోసం ఆ ఓటీటీ దిగ్గజం భారీ రేటు చెల్లించిందట. వీరి వివాహాన్ని ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ చిత్రీకరిస్తారట. నయన్, విఘ్నేష్‌ల పెళ్లి వేడుక స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లీక్స్ సంస్థ కొన్నదట. ఈ క్రమంలో, ఒక్క ఫోటో లేదా వీడియో గానీ బయటకు లీక్ కాకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
Read More: తమిళనాడు సీఎంను పెళ్లికి ఆహ్వానించిన నయనతార, విఘ్నేష్