కవల పిల్లలకు తల్లిదండ్రులైన విఘ్నేష్ శివన్-నయనతార (Vignesh Shivan-Nayanathara) జంట.. ఫొటోలు వైరల్!

Updated on Oct 09, 2022 09:03 PM IST
తల్లిదండ్రులైన విషయాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
తల్లిదండ్రులైన విషయాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

స్టార్ హీరోయిన్ నయనతార తల్లయ్యారు. విఘ్నేష్ శివన్ (Vignesh Shivan), నయనతార (Nayanathara) జంట మగ కవల పిల్లలకు అమ్మానాన్నలయ్యారు. 2022 జూన్ 9న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు నయనతార మళ్ళీ సినిమా షూటింగ్స్ లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత హనీమూన్ కోసం నెల రోజులకుపైగానే ఇద్దరూ దుబాయ్ వెళ్లారు. అయితే, పెళ్లయి 5 నెలలు కూడా కాలేదు.. అప్పుడే కవల పిల్లలు ఎలా పుట్టారనే అనుమానం రావచ్చు.

ఈ విషయాన్ని నయనతార, విఘ్నేష్ శివన్ (Vignesh Shivan) సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "నయన్-నేను అమ్మ, నాన్నగా మారాము. మేము ఆశీర్వదించబడ్డాము. మాకు ట్విన్ బేబీ బాయ్స్.. మా ప్రార్థనలు, మా పెద్దల ఆశీర్వాదాలు అన్ని కలిపి మాకు ఇద్దరు శిశువుల రూపంలో దక్కాయి. మా కోసం మీ అందరి ఆశీస్సులు కావాలి. ఉయిర్- ఉలగం" అంటూ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు విఘ్నేష్ శివన్. 

2015లో వచ్చిన ‘నానుం రౌడ్ ధాన్’ సినిమా సెట్స్‌లో తొలిసారి కలుసుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్.. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన వీరిద్దరూ.. ఆ తరవాత లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశారు. ఈ ఏడాది జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 

విఘ్నేష్ శివన్-నయనతార (Vignesh Shivan-Nayanthara) వివాహ వేడుకకు రజినీకాంత్, మణిరత్నం, షారుఖ్ ఖాన్, సూర్య, విజయ్ సేతుపతి, డైరెక్టర్ అట్లీ లాంటి స్టార్లు ఎంతో మంది హాజరయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తికాక ముందే సరోగసీ ద్వారా వీరిద్దరూ తల్లిదండ్రులు కూడా అయిపోయారు.

Read More: విఘ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయనతార (Nayanthara).. సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!