విఘ్నేష్ శివన్ తో పెళ్లి తర్వాత షాకింగ్ నిర్ణయం తీసుకున్న నయనతార (Nayanthara).. సినిమాలకు గుడ్ బై చెప్పనుందా?

Updated on Sep 03, 2022 05:11 PM IST
విఘ్నేశ్ శివన్ తో (Vignesh Shivan) ప్రేమలో పడిన నయనతార (Nayanthara).. దాదాపు ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ కొనసాగించింది.
విఘ్నేశ్ శివన్ తో (Vignesh Shivan) ప్రేమలో పడిన నయనతార (Nayanthara).. దాదాపు ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ కొనసాగించింది.

సౌతిండియా లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార (Nayanthara). అన్ని సినిమా ఇండస్ట్రీలలో బడా హీరోలందరి సరసన నటించిన ఈ బ్యూటీకి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె సినిమాలను ఆదరించే వారి సంఖ్య చాలా ఎక్కువ. బెంగళూరుకు చెందిన నయన్ చిన్న వయసులోనే  సినీ కేరీర్ ను ప్రారంభించింది. 

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో 50కిపైగా చిత్రాల్లో నటించింది. అంతేకాదు దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయిక ఈమెనే కావడం విశేషం. 

తన భర్త విఘ్నేష్ శివన్ తో నయనతార (Nayanathara With Her Husband Vignesh Shivan)

నయనతార మాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసి, సౌత్ మొత్తం కవర్ చేసేసింది. ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) లోనూ సత్తా చాటే పనిలో ఉంది ఈ అమ్మడు. దాదాపు 20 ఏళ్లపాటు సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించిన ఈ బ్యూటీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. చివరిగా తమిళ చిత్రం ‘కాతువాకుళ రెండు కాదల్’, ‘ఓ2’, చిత్రాలతో అలరించింది.  

తమిళంలో ‘నేనే రౌడీనే’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆ మూవీ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తో (Vignesh Shivan) ప్రేమలో పడిన నయనతార.. దాదాపు ఏడేళ్లపాటు రిలేషన్ షిప్ కొనసాగించింది. ఆ తర్వాత ఈ ఏడాది మేలో అతడినే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అటు ఫ్యామిలీ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తోంది ఈ బ్యూటీ.

తన భర్త విఘ్నేష్ శివన్ తో నయనతార (Nayanathara With Her Husband Vignesh Shivan)

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న 'జవాన్' మూవీతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో 'గాడ్ ఫాదర్' (God Father) మూవీలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది. తమిళంలో గోల్డ్ అనే సినిమా ఈ సెప్టెంబర్ 8న రిలీజ్ కానుంది. మరో రెండు సినిమాలకు సైన్ చేసింది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నయనతార (Nayanthara Fans) అభిమానులను ఆందోళనకు గురి చేసే వార్త ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆమె త్వరలో నటనకు గుడ్‌బై చెప్పబోతుందన్నదే అభిమానులను కలతకు గురి చేస్తున్న వార్త. ఇక, ఆమె నటనకు స్వస్తి చెప్పి తన ఇతర వ్యాపారాల వ్యవహారాలు చూసుకుంటూ జీవితాన్ని గడపాలని భావిస్తున్నట్లు సమాచారం. 

అయితే నయనతార నటనకు గుడ్‌బై చెప్పినా నిర్మాతగా మారి మంచి చిత్రాలను నిర్మించాలని భావిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సినిమాల్లో సంపాదించిన డబ్బును ఇతర రంగాల్లో పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం లేదుగానీ.. నెట్టింట వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. 

Read More: నయనతార (Nayanthara) స్టార్ హీరోయిన్ కాదంటూ కరణ్ జోహార్ (Karan Johar) వ్యాఖ్యలు.. ఫ్యాన్స్ ఫైర్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!