వెడ్డింగ్ పార్టీలో మ‌హాన‌టి ! నా వాళ్ల‌తో క‌లిసి గాడ్ కంట్రీలో ఉన్నాను : కీర్తి సురేష్ (Keerthy Suresh)

Updated on Jun 14, 2022 12:01 PM IST
కీర్తి సురేష్ (Keerthy Suresh)మ‌రో హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌తో క‌లిసి ఓ వెడ్డింగ్‌కు వెళ్లారు.  త‌న సొంత రాష్ట్రం కేర‌ళ‌ వెళ్ల‌డం ఫుల్ హ్యాపీ అంటున్నారు కీర్తి. 
కీర్తి సురేష్ (Keerthy Suresh)మ‌రో హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌తో క‌లిసి ఓ వెడ్డింగ్‌కు వెళ్లారు. త‌న సొంత రాష్ట్రం కేర‌ళ‌ వెళ్ల‌డం ఫుల్ హ్యాపీ అంటున్నారు కీర్తి. 

కీర్తి సురేష్.. కెరీర్ ప్రారంభించిన కొద్ది రోజులలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన కథానాయిక. ఈమెకు ఇన్‌స్టాగ్రాంలో 3.1 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 'పైలట్స్' అనే మలయాళం చిత్రం ద్వారా బాలనటిగా కెరీర్ ప్రారంభించిన కీర్తి.. 'నేను శైలజ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నేను లోకల్, మిస్ ఇండియా, రంగ్ దే లాంటి సినిమాలలోనూ నటించారు. 

ఏదేమైనా, అనతికాలంలోనే సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు కీర్తి సురేష్ (Keerthy Suresh). 'మ‌హాన‌టి' చిత్రంలో అలనాటి మేటి నటి సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయారు. తన న‌ట‌న‌తో జాతీయ అవార్డు సాధించ‌డ‌మే కాకుండా.. ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకున్నారు.

ఇటీవలే విడుదలైన 'స‌ర్కారు వారి పాట' సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించ‌డంతో కీర్తి సురేష్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం స్నేహితురాలి పెళ్లికి ఈ బ్యూటీ త‌న సొంత రాష్ట్రం కేర‌ళ వెళ్లారు. కీర్తి సురేష్ మ‌రో హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌ితో క‌లిసి ఓ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. ఇదే క్రమంలో ఆమె త‌న ఇన్ స్టాలో ప‌లు ఫోటోల‌ను షేర్ చేశారు.  త‌న సొంత రాష్ట్రం కేర‌ళ‌కి వెళ్ల‌డం ఫుల్ హ్యాపీ అంటూ ఓ పోస్టును పంచుకున్నారు.  

వెడ్డింగ్ పార్టీలో సంద‌డి చేస్తున్న మ‌హాన‌టి
కేర‌ళ‌లో ఓ వివాహానికి వెళ్లిన కీర్తి సురేష్ (Keerthy Suresh) త‌న స్నేహితుల‌తో క‌లిసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ కేర‌ళ ట్రిప్ సూప‌ర్‌గా ఉందని, ఈ హాలీడేని బాగా ఆస్వాదించానని ఆమె తెలిపారు. ఇదే క్రమంలో, సోషల్ మీడియాలో తన విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. దేవుడి దేశంలో త‌న వాళ్ల‌తో క‌లిసి ఉన్నానంటూ స‌ర‌దాగా పోస్ట్ చేశారు.  త‌న బంధువుల‌తో, స్నేహితుల‌తో దిగిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. హీరోయిన్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శితో కలిసి సందడి చేసిన చిత్రాలను కూడా పోస్ట్ చేశారు.

మ‌హేష్ బాబుతో న‌టించిన 'స‌ర్కారు వారి పాట‌' హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాక, కీర్తి సురేష్ (Keerthy Suresh) విజ‌యాల వైపు దూసుకెళుతున్నారు. 'మ‌హాన‌టి' త‌ర్వాత కీర్తి నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. కానీ ఆమె ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌లేదు.  'స‌ర్కారు వారి పాట‌' సినిమా తర్వాత మళ్లీ కీర్తి సురేష్‌కు మంచి రోజులు వచ్చాయనే చెప్పవచ్చు. 

 

ఆ హీరోల‌తో న‌టించే అవ‌కాశం వ‌దులుకోను - కీర్తి
కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో న‌టిస్తున్నారు. చిరంజీవికి చెల్లెలు పాత్ర‌ను ఆమె పోషిస్తున్నారు. మెహర్ రమేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రం పై కీర్తికి పెద్ద ఆశలే ఉన్నాయి. గతంలో ర‌జ‌నీకాంత్ నటించిన 'పెద్దన్న' సినిమాలో కూడా కీర్తి సురేష్ ఆయన చెల్లెలు పాత్ర‌లో న‌టించారు.

ఇప్పుడు చిరంజీవి సినిమాలో తను చెల్లెలి పాత్ర ఎందుకు చేస్తున్నారో కూడా కీర్తి ప్రేక్ష‌కుల‌కు వివరణ ఇచ్చారు. ర‌జ‌నీకాంత్, చిరంజీవి టాప్ స్టార్ల‌ని.. అలాంటి వారి ప‌క్క‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే వ‌దులుకోన‌ని  కూడా కీర్తి తెలిపారు. తాను చెప్పిన‌ట్లుగానే సీనియ‌ర్ స్టార్ హీరోల ప‌క్క‌న కూడా  కీర్తి న‌టిస్తున్నారు.

Read More: త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగా న‌టిస్తున్న‌ చిరంజీవి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!