త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగా న‌టిస్తున్న‌ చిరంజీవి (Chiranjeevi)

Updated on May 29, 2022 01:46 PM IST
 చిరంజీవి  (Chiranjeevi) లాంటి హీరోల‌తో న‌టించే అవ‌కాశం అంద‌రికీ రాద‌ని.. అందుకే చెల్లెలు క్యారెక్ట‌ర్‌లో న‌టించేందుకు ఒప్పుకున్నాన‌ని కీర్తి సురేష్  చెప్పారు. 
చిరంజీవి (Chiranjeevi) లాంటి హీరోల‌తో న‌టించే అవ‌కాశం అంద‌రికీ రాద‌ని.. అందుకే చెల్లెలు క్యారెక్ట‌ర్‌లో న‌టించేందుకు ఒప్పుకున్నాన‌ని కీర్తి సురేష్ చెప్పారు. 

చిరంజీవి(Chiranjeevi) త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసిన న‌టించిన‌ ఆచార్య డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఆచార్య త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ప‌లు కొత్త సినిమాలు చేస్తూ బిజీగా మారారు. ఫ్యాన్స్ కోసం హిట్ సినిమా త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. గాడ్ ఫాద‌ర్, వాల్తేరు వీర‌య్య‌, భోళా శంక‌ర్ (Bhola Shankar) సినిమాలతో బిజీగా మారారు. భోళా శంక‌ర్ సినిమా మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌, ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్స్  చిరంజీవి న‌టిస్తున్న భోళా శంక‌ర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ బ్ర‌హ్మం సుంక‌ర ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్నినిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. భోళా శంక‌ర్ సినిమాలో చిరుకు జోడిగా హీరోయిన్ త‌మ‌న్నా భాటియా న‌టిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి (Chiranjeevi) కి చెల్లెలుగా క‌నిపిస్తున్నారు. వేదాళం అనే త‌మిళ సినిమాను తెలుగులో భోళా శంక‌ర్‌గా రీమేక్ చేస్తున్నారు. 

భోళా శంక‌ర్ సినిమ ఫ‌స్ట్ లుక్‌లో చిరంజీవి (Chiranjeevi) మాస్‌గా క‌నిపించారు

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానిగా క‌నిపించ‌నున్నార‌ట‌. ఖుషీలో ప‌వ‌న్, భూమిక‌ల మ‌ధ్య న‌డుము సీన్ భోళా శంక‌ర్‌లో ఫ‌న్నీగా చూపించాల‌ని మెహ‌ర్ ర‌మేష్ అనుకుంటున్నార‌ట‌. చిరంజీవి, శ్రీముఖిల‌తో స‌ర‌ద‌గా ఆ సీన్ చేయించాల‌నుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఖుషీ సినిమాలో న‌డుం సీను రిపీట్ చేస్తున్నారంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. 

చిరుకు ప్ల‌స్‌గా మార‌నున్న‌ మాస్ లుక్

భోళా శంక‌ర్ సినిమ ఫ‌స్ట్ లుక్‌లో చిరంజీవి (Chiranjeevi) మాస్‌గా క‌నిపించారు. స్టైలిష్ జీపుపై కూర్చుని కీ చైన్ తిప్పుతూ చిరంజీవి కొత్తగా క‌నిపించారు. మెహ‌ర్ ర‌మేష్ చిరంజీవికి భోళా శంక‌ర్ మాస్ హిట్ ఇచ్చేలా చేయాల‌నుకుంటున్నారు. చెల్లెలు సెంటిమెంట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. మ‌హాన‌టిగా గుర్తింపు తెచ్చుకుని నేష‌న‌ల్ అవార్డు సొంతం చేసుకున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చెల్లిగా న‌టిస్తున్నారు. చిరంజీవి లాంటి హీరోల‌తో న‌టించే అవ‌కాశం అంద‌రికీ రాద‌ని కీర్తి సురేష్ అన్నారు. అందుకే చెల్లెలు క్యారెక్ట‌ర్‌లో న‌టించేందుకు ఒప్పుకున్నాన‌ని చెప్పారు. 

 చిరంజీవి  (Chiranjeevi) లాంటి హీరోల‌తో న‌టించే అవ‌కాశం అంద‌రికీ రాద‌ని.. అందుకే చెల్లెలు క్యారెక్ట‌ర్‌లో న‌టించేందుకు ఒప్పుకున్నాన‌ని కీర్తి సురేష్  చెప్పారు. 

చిరంజీవి డాన్సులు అదుర్స్ అట‌

భోళా శంక‌ర్ త‌మిళ్ వ‌ర్ష‌న్‌లో హీరో అజిత్ న‌టించారు. డూడ్లే ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతం అందిస్తున్నారు. భోళా శంక‌ర్ సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. శేఖ‌ర్ మాస్ట‌ర్ చిరంజీవితో కొత్త‌ స్టెప్పులు వేయిస్తున్నారు. చిరంజీవి ఈ సారి మాస్ డాన్సుల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచుతార‌ని కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ అంటున్నారు. 

ఆచార్య సినిమా ఫ్లాప్ అవ‌డంతో చిరంజీవి త‌న నెక్ట్ సినిమాల ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. భోళా శంక‌ర్ క‌థ‌లోనూ కొన్ని మార్పులు చేయాల‌ని మెహ‌ర్ ర‌మేష్‌కు చిరంజీవి చెప్పార‌ట‌. మెగాస్టార్ చిరంజీవి సినిమా స‌క్సెస్ సాధించేలా మెహ‌ర్ ర‌మేష్ మ‌రింత కృషి చేస్తున్నార‌ట‌.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!