Keerty Suresh: కీర్తి సురేష్‌ను ఫాలో అవుతున్న నయనతార .. ముఖ్యంగా చిరంజీవి సినిమాల విషయంలో ?

Updated on Jun 21, 2022 06:41 PM IST
భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి సురేష్
భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలి పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి సురేష్

అగ్ర హీరోల సినిమాల్లో న‌టించేందుకు హీరోయిన్లు పోటీ ప‌డుతుంటారు. ఇక‌ చిరంజీవి (Chiranjeevi) సినిమా అంటే ఎగిరి గంతేస్తారు. 'భోళా శంక‌ర్' సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టించ‌నున్నారు. ఇక న‌య‌న‌తార కూడా కీర్తి సురేష్ బాట‌లో న‌డుస్తున్నార‌ట‌. 'సైరా' సినిమాలో చిరంజీవికి సతీమణిగా న‌టించిన న‌య‌న‌తార‌.. 'గాడ్ ఫాద‌ర్‌'లో మెగాస్టార్ చెల్లెలుగా వెండితెర‌పై క‌నిపించ‌నున్నారు.

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి సురేష్.

క‌థ బాగుంటే చెల్లెలి పాత్ర‌లు కూడా చేస్తా : కీర్తి
'ఆచార్య' త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు చిరు హిట్ చిత్రాల‌ను అందించాల‌నుకుంటున్నారు. భోళా శంక‌ర్, గాడ్‌ ఫాద‌ర్, వాల్తేరు వీర‌య్య చిత్రాల షూటింగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉన్నారు.

అయితే ఈ సినిమాల్లో 'భోళా శంక‌ర్' మాత్రం ప్ర‌త్యేక‌మైంది. మెగాస్టార్ చిరంజీవికి దూరపు బంధువైన మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలు పాత్ర‌లో న‌టిస్తున్న కీర్తి సురేష్.

భోళా శంక‌ర్ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవి (Chiranjeevi) చెల్లెలి పాత్ర‌లో న‌టించ‌నున్నారు. అగ్ర హీరోల‌తో క‌లిసి న‌టించాలంటే అన్ని సార్లు అవ‌కాశం రాద‌ని కీర్తి సురేష్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.

ర‌జ‌నీకాంత్ సినిమాలో చెల్లెలు పాత్ర చేయ‌మ‌ని అడ‌గార‌ని.. అంత పెద్ద స్టార్ ప‌క్క‌న న‌టించే అవ‌కాశం రావ‌డంతో వెంట‌నే ఓకే చేశాన‌న్నారు. చిరంజీవి విష‌యంలో కూడా అలాగే ఆలోచించాన‌ని చెప్పారు కీర్తి.  భోళా శంక‌ర్‌లో చిరు ప‌క్క‌న చెల్లెలుగా న‌టిస్తున్నానని ఆమె చెప్పారు.  

'భోళా శంక‌ర్' సినిమాలో చిరంజీవి స‌ర‌స‌న త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌నున్నారు. ఈ చిత్రంలో చిరు, త‌మ‌న్నా చేసే డాన్సులు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి. 'భోళా శంక‌ర్' చిత్రీక‌ర‌ణ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ కూడా పూర్తి చేశారట‌. త‌మిళ సినిమా 'వేదాళం' రీమేక్‌గా భోళా శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు.  

 
    

సైరాలో చిరంజీవి (Chiranjeevi) భార్య‌గా న‌టించిన న‌య‌న‌తార‌.. గాఢ్ ఫాద‌ర్‌లో చెల్లెలుగా న‌టిస్తున్నారు.

చిరు (Chiranjeevi)కు చెల్లిగా న‌య‌న్
ప్రస్తుతం కీర్తి సురేష్ బాట‌లోనే న‌య‌న‌తార కూడా న‌డుస్తున్నారు. సైరాలో చిరంజీవి సతీమణిగా న‌టించిన న‌య‌న‌తార‌.. 'గాడ్ ఫాద‌ర్‌'లో చెల్లెలుగా న‌టిస్తున్నారు. సీనియ‌ర్ స్టార్ హీరోల సినిమాల్లో సిస్ట‌ర్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని న‌య‌న్ డిసైడ్ అయ్యారు. న‌య‌న్ పెళ్లి త‌ర్వాత న‌టించ‌బోయే సినిమాల్లో 'గాడ్ ఫాద‌ర్' ఒక‌టి.

మ‌రోవైపు పెళ్లైన త‌ర్వాత న‌య‌న్ ఇక సినిమాల్లో న‌టించ‌ర‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. 'గాడ్ ఫాదర్' సినిమాలో బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఓ స్పెష‌ల్ రోల్‌లో న‌టిస్తున్నారు.  మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్‌గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతుంది. 

Read More: చిరంజీవి (Chiranjeevi) సినిమాలో విలన్‌గా న‌టిస్తున్న స‌ల్మాన్ ఖాన్.. ఆ సినిమా పేరేమిటో తెలుసా ?

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!