పెళ్లి పీటలెక్కబోతున్న పాలబుగ్గల బ్యూటీ హన్సిక (Hansika Motwani).. డిసెంబర్ 4న వివాహం.. కాబోయే భర్త ఎవరంటే?

Updated on Nov 02, 2022 12:58 PM IST
కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది హన్సిక (Hansika Motwani). చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ కూతురియాను వివాహమాడబోతున్నట్లు ఆమె తెలిపారు.
కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది హన్సిక (Hansika Motwani). చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ కూతురియాను వివాహమాడబోతున్నట్లు ఆమె తెలిపారు.

కొన్నేళ్ల క్రితం దక్షిణాది అగ్ర కథానాయికల్లో ఒకరిగా ఓ వెలుగువెలిగింది బొద్దుగుమ్మ హన్సిక (Hansika Motwani). టాలీవుడ్ లో అతిచిన్న వయసులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కిన 'దేశముదురు' చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది హన్సిక. ఈ సినిమా తో ఓవర్ నైట్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. 

'దేశముదురు' (Deshamuduru) తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎన్టీఆర్ తో కంత్రి, ప్రభాస్ తో బిల్లా, రామ్ తో కందిరీగ,మస్కా , రవితేజ తో పవర్ వంటి చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది హన్సిక. మరోవైపు తమిళంలో కూడా వరుస సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి స్టార్ డమ్ ని సంపాదించుకుంది. ఇక, జూనియర్ ఖుష్బూగా అక్కడి ప్రేక్షకులు హన్సిక ను భావించి ఆమెకు గుడి కూడా కట్టేశారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం హన్సిక (Hansika Motwani) గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పాలబుగ్గల బ్యూటీ హన్సిక త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హన్సిక వెల్లడించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 4న రాజస్థాన్, జైపూర్ ప్యాలెస్ లో హన్సిక పెళ్ళికి ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తనకు కాబోయే భర్తను అభిమానులకు పరిచయం చేసింది హన్సిక (Hansika Motwani). తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ కూతురియాను వివాహమాడబోతున్నట్లు ఆమె తెలిపారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌తో అతనితో పారిస్‌ ఈఫిల్‌ టవర్‌ ముందు దిగిన ఫొటోలను షేర్‌ చేశారు. ‘ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా, ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌గా మారాయి.

హన్సిక (Hansika Motwani) పెళ్లాడబోయే సోహైల్‌ కూతురియా ఓ ప్రముఖ వ్యాపారి. సొహైల్ సోదరి హన్సిక కు చిన్నప్పటి నుండీ బెస్ట్ ఫ్రెండ్ అట. రాజస్థాన్ లోని జైపూర్ ప్యాలెక్ లో హన్సిక పెళ్లి ఓ నాలుగు రోజులు పాటు జరగబోతున్నట్లుగా తెలుస్తోంది. మెహిందీ, సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్ తో పాటుగా పెళ్లి కి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ పెళ్ళికి హన్సిక ఫ్యామిలీ, సోహైల్ కుటుంబ సభ్యులతో పాటుగా.. కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం.

Read More: “విడాకుల మీద నమ్మకం లేదు. పెళ్లయ్యాక విడాకులు తీసుకోవాలనుకోవడం లేదు” : పెళ్లిపై త్రిష (Trisha) కామెంట్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!