తెలుగులో మరో సినిమాకు విజయ్ (Vijay) గ్రీన్ సిగ్నల్!.. అట్లీ (Atlee)తో మూవీ కన్ఫర్మ్ అయినట్లే?

Updated on Oct 21, 2022 03:55 PM IST
తెలుగులో మరో మూవీ చేసేందుకు ఇళయదళపతి విజయ్ (Vijay) సిద్ధమవుతున్నారని సమాచారం
తెలుగులో మరో మూవీ చేసేందుకు ఇళయదళపతి విజయ్ (Vijay) సిద్ధమవుతున్నారని సమాచారం

కోలీవుడ్ స్టార్ హీరోలు టాలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్నారు. డబ్బింగ్ చిత్రాల ద్వారా ఇక్కడ వచ్చిన క్రేజ్‌ను మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నేరుగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా తమిళ స్టార్లు ధనుష్ (Dhanush), విజయ్ (Vijay), శివకార్తికేయన్ (Sivakarthikeyan) తెలుగు చిత్రాలు చేసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ధనుష్ తెలుగులో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శివకార్తికేయన్ నటించిన తెలుగు చిత్రం ‘ప్రిన్స్’ ఇవ్వాళ రిలీజైంది. 

ఇక, ఇళయదళపతి విజయ్ ‘వరిసు’ (వారసుడు)తో తెలుగు ప్రేక్షకులకు నేరుగా పరిచయం కాబోతున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో నేషనల్ క్రష్ రష్మికా మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ఫిల్మ్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

మరో తెలుగు చిత్రానికి దళపతి పచ్చజెండా! 

‘వారసుడు’ (Vaarasudu) తర్వాత కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించనున్నారు. ఇది ఆయనకు 67వ చిత్రం కానుంది. లోకేష్ ఈ సినిమాను లావిష్‌గా తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇక, విజయ్ 68వ ఫిల్మ్ గురించి ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీస్ బ్యానర్‌లో చేయడానికి దళపతి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీస్ (Mythri Movies) నుంచి విజయ్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు వినికిడి. 

దర్శకుడిగా అట్లీ?

విజయ్ 69వ చిత్రానికి సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తారని.. ఆయన ఇటీవల మైత్రీ మూవీస్ అధినేతలకు స్టోరీని కూడా వినిపించారట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఇకపోతే.. విజయ్, అట్లీ కాంబోలో వచ్చిన ‘తెరీ’, ‘మెర్సల్’ మంచి విజయాలు సాధించాయి. దీంతో వీరిద్దరి కలయికలో మూడో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ విజయ్ 69వ చిత్రంపై వస్తున్న గాసిప్స్ నిజమైతే మరో బ్లాక్ బస్టర్ మూవీని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.

Read more: దళపతి విజయ్ (Vijay) & లోకేష్ కనగరాజ్ సినిమాలో హీరోయిన్‌గా త్రిష (Trisha).. 14 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!