'వారసుడు' (Varasudu) సినిమాలో ఓ పాట పాడబోతున్న దళపతి విజయ్ (Thalapathy Vijay).. దీపావళికి సాంగ్ రిలీజ్!

Updated on Oct 19, 2022 03:31 PM IST
తాజాగా 'వారసుడు' (Varasudu) చిత్రానికి సంబంధించిన విశేషం ఒకటి సందడి చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ (Hero Vijay) ఓ పాట పాడినట్లు తెలుస్తోంది.
తాజాగా 'వారసుడు' (Varasudu) చిత్రానికి సంబంధించిన విశేషం ఒకటి సందడి చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ (Hero Vijay) ఓ పాట పాడినట్లు తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Hero Vijay) నటిస్తున్న తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు'గా (Varasudu) తెరకెక్కుతోంది. విజయ్ సరసన హీరోయిన్ గా తొలి సారి రష్మిక మందన్నా అలరించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

తెలుగు, తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న 'వారసుడు' (Varasudu) మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ తాలూకా ఫస్ట్ సింగిల్ ను దీపావళి సందర్బంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా తెరకెక్కనుంది. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషం ఒకటి సందడి చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ (Hero Vijay) ఓ పాట పాడినట్లు తెలుస్తోంది. 'అరబిక్ కుతు' సాంగ్ ఫేమ్ జోనితా గాంధీ కూడా ఈ సాంగ్ ను కలిసి పాడినట్లు తెలుస్తోంది. తమన్ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో విజయ్ పాడిన పాట చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ కానుందని సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. 

అయితే, విజయ్ కు పాట పాడటం కొత్త కాదు. గతంలో 'బీస్ట్' (Beast) సినిమాలోనూ ఆయన శివకార్తికేయన్ రాసిన ఓ పాట పాడారు. మరోవైపు 'వారీసలో విజయ్ పాట అభిమానులను ఆకట్టుకునేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జయసుధ, ప్రకాష్ రాజ్, ప్రభు, శ్రీకాంత్, యోగి బాబు, శరత్‌కుమార్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  

Read More: సంక్రాంతి బరిలో విజయ్ (Hero Vijay)-వంశీ పైడిపల్లి సినిమా 'వారసుడు' (Varasudu).. అధికారిక ప్రకటన వచ్చేసింది!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!