'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇంటెన్స్ లుక్ అదిరిపోయిందిగా..!

Updated on Oct 13, 2022 01:12 PM IST
'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ 'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu). కరోనా కంటే ముందే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాకు అప్పటి నుండి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. గతేడాది షూటింగ్‌ ప్రారంభించినా.. మళ్ళీ కొన్ని రోజులకే పలు కారణాలతో షూటింగ్‌ ఆగిపోయింది. కాగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ పునఃప్రారంభం కానుంది.

'హరిహర వీరమల్లు' (Hari Hara Veera Mallu) ఏఎం రత్నం నిర్మిస్తుండగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎమ్ఎమ్ కీరవాణి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూట్‌కు సంబంధించిన పనులను స్టార్ట్‌ చేశారు. ఇటీవలే పవన్‌ కూడా చిత్రబృందంతో కలిసి వర్క్‌ గురించి చర్చలు జరిపాడు. ఇదిలా ఉంటే తాజాగా పవన్‌ కళ్యాణ్‌కు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది.
 

ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హూడీ జాకెట్ ధరించి యాక్షన్ స్టంట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, ఈ యాక్షన్ ఎపిసోడ్స్ వర్క్ షాప్ కి సంబంధించిన పవన్ పిక్ చిత్ర యూనిట్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. పవన్ లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ కలిగించే విధంగా ఉంది. దీంతో ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

ఇక 'హరిహర వీరమల్లు' చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. పైగా ఇటీవలే విడుదలైన గ్లింప్స్ అంచనాలను రెట్టింపు చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలవుతుందా అనే క్యూరియాసిటీని మేకర్స్ ప్రేక్షకుల్లో క్రియేట్‌ చేశారు. అర్జున్ రామ్‌పాల్, న‌ర్గిస్ ఫ‌క్రి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Read More: పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) 'హరిహర వీరమల్లు' సినిమా అప్‌డేట్స్‌ను పోస్ట్ చేసిన‌ ద‌ర్శ‌కుడు క్రిష్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!