అల్లు అర్హ (Allu Arha) బర్త్ డే.. స్పెషల్ వీడియో షేర్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)

Updated on Nov 21, 2022 01:25 PM IST
అల్లు అర్హ (Allu Arha) పుట్టిన రోజు సందర్భంగా కూతురిపై ఉన్న ప్రేమను బన్నీ (Allu Arjun) మరోమారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు
అల్లు అర్హ (Allu Arha) పుట్టిన రోజు సందర్భంగా కూతురిపై ఉన్న ప్రేమను బన్నీ (Allu Arjun) మరోమారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు తన కూతురు అర్హ, కొడుకు అయాన్ అంటే ఎంతో ఇష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ గ్యాప్ దొరికితే కూతురు, కొడుకుతో ఆడుకుంటూ సరదాగా గడిపేస్తారు బన్నీ. ఆ క్షణాలను కెమెరాలో బంధించి, అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయితే అయాన్ కంటే అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా కనిపిస్తుంటాయి. బన్నీ ఫ్యాన్స్ వీటిని వైరల్ చేస్తుంటారు. 

ఇవాళ ఆరో పుట్టిన రోజు జరుపుకుంటున్న కూతురు అర్హపై తనకు ఉన్న ప్రేమను.. బన్నీ మరోమారు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘నా జీవితంలోని క్యూట్‌నెస్ నువ్వే’ అంటూ అర్హ (Allu Arha) అల్లరి చేస్తున్న ఓ వీడియోను అల్లు అర్జున్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. తమ ఇంట్లో కందిరీగలు ఉన్న విషయం గురించి బన్నీకి అర్హ వివరిస్తున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అర్హ ముద్దుముద్దు మాటలకు అల్లు అర్జున్ నవ్వుతూ మురిసిపోవడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. 

‘నా జీవితంలోని క్యూట్‌నెస్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ ఈ పోస్ట్‌కు అల్లు అర్జున్ క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి కందిరీగ కథలు అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు. ఇకపోతే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ చిత్రంలో నటిస్తున్నారు. ‘పుష్ప’ తొలి పార్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో సీక్వెల్ మీద అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఉత్తరాదిన కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో ‘పుష్ప 2’పై అక్కడా భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే బన్నీ, సుకుమార్ ఈ చిత్రం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

‘పుష్ప 2’ సినిమాకు ఎంత ఖర్చు పెట్టేందుకైనా మేకర్స్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. సౌత్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఈ మూవీ సీక్వెల్ పై భారీ క్రేజ్ ఉంది. కాబట్టి పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవడం అంత కష్టం కాకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట. ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే హాలీవుడ్ మూవీ ‘అవతార్ 2’ రిలీజయ్యే స్క్రీన్లలో ‘పుష్ప 2’ ఫస్ట్ లుక్ టీజర్ వీడియోను విడుదల చేయాలని సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి, ఈ మూవీ ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటో చూడాలి. 

Read more: NTR 30: ఎన్టీఆర్ 30 కోసం అనిరుధ్‌ను ఫిక్స్ చేసిన కొరటాల శివ

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!