Bimbisara Update: 'బింబిసార'లో రాజకుమారి 'ఐరా' పాత్రలో కేథరిన్ (Catherine Tresa).. ఇంట్రడక్షన్ వీడియో వైరల్!

Updated on Jul 24, 2022 05:35 PM IST
తాజాగా కేథ‌రిన్ ట్రెసా (Catherine Tresa) ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కేథ‌రిన్.. 'ఐరా' పాత్ర‌లో న‌టించింది.
తాజాగా కేథ‌రిన్ ట్రెసా (Catherine Tresa) ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కేథ‌రిన్.. 'ఐరా' పాత్ర‌లో న‌టించింది.

Bimbisara Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాప్‌ల‌తో సంబంధంలేకుండా వ‌రుసగా సినిమాల‌ు చేస్తూ ఎంట‌ర్టైన్ చేస్తుంటాడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'బింబిసార'. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు కొత్త దర్శకుడు శ్రీ వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇక, 'బింబిసార' (Bimbisara Movie) చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నారు కళ్యాణ్ రామ్. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ 'బింబిసార' సినిమా.  ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేక‌ర్స్ వ‌రుస అప్‌డేట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా చిత్రబృందం మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించింది.

ఫాంట‌సి యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్‌కు జోడీగా కేథ‌రిన్ ట్రెసా (Catherine Tresa) హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కేథ‌రిన్.. 'ఐరా' పాత్ర‌లో న‌టించింది. ఇటీవల విడులైన ఈ వీడియోలో కేథ‌రిన్ ఆభ‌ర‌ణాలు ధ‌రిస్తూ అచ్చం దేవ‌క‌న్య‌లా మెరిసిపోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం నుండి “ఓ తేనె పలుకుల” అనే డ్యూయెట్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పాటలో అందాల భామ కేథరిన్ తో కళ్యాణ్ రామ్ (Kalyan Ram) చేసిన రొమాన్స్ అద్భుతంగా ఉండగా.. విజువల్ పరంగా ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. రాజు పాత్రలోని నందమూరి కళ్యాణ్ రామ్ కొంటెగా పాడుతుంటే.. దానికి బదులుగా ఆమె ‘ఓ కోర మీసపు అబ్బాయి.. నీ ఓర చూపుల లల్లాయి.. బాగుందోయ్’ అంటూ.. అతనిలోని చిలిపిదనాన్ని మరింతగా రెచ్చగొడుతోంది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!