Ormax Media: మోస్ట్ పాపుల‌ర్ స్టార్ రేసులో ముందున్న‌ ఎన్టీఆర్, స‌మంత‌

Updated on May 15, 2022 05:24 PM IST
 పాపుల‌ర్ హీరో ఎన్టీఆర్ , టాప్ హీరోయిన్ స‌మంత
పాపుల‌ర్ హీరో ఎన్టీఆర్ , టాప్ హీరోయిన్ స‌మంత

Ormax Stars India Loves: తెలుగు సినిమాల్లో హీరో, హీరోయిన్ల పాపులారిటీ తెలిపేందుకు ఓ సంస్థ స‌ర్వే చేసింది. ఆ స‌ర్వేలో పాపుల‌ర్ హీరోగా ఎన్టీఆర్(NTR) ముందుంటే.. టాప్ హీరోయిన్ ప్లేస్‌ను స‌మంత(Samantha) సొంతం చేసుకున్నారు. 

నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయ‌ని ఎన్టీఆర్(NTR) కొమ‌రం భీముడిగా మ‌రో నాలుగు త‌రాలు గుర్తుపెట్టుకునేలా చేశాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్టీఆర్ న‌ట విశ్వ‌రూపం చూపారు. త‌న కేరియ‌ర్‌లో బెస్ట్ సినిమాగా ఎన్టీఆర్‌కు ఆర్.ఆర్.ఆర్. సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చింది. .

 పాపుల‌ర్ హీరో ఎన్టీఆర్

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ (Ormax Media) ఇండియ‌న్  యాక్ట‌ర్ల‌పై స‌ర్వే నిర్వ‌హిస్తుంది. లేటెస్ట్ సర్వేలో అత్యంత పాపులారిటీ ఉన్న టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 2022 సర్వే ప్రకారం ఎన్టీఆర్ మొద‌టి ర్యాంకు సాధించారు. గ‌తేడాది ఎన్టీఆర్ టాప్ 4లో నిలిచారు. ఎన్టీఆర్ తర్వాత ప్రభాస్ ప్రభాస్ 2వ స్థానం సొంతం చేసుకున్నారు. 

టాప్ ఫైవ్ లో వరుసగా ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ ఉన్నారు. గ‌తేడాది టాప్ 5లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ ఏడాది టాప్ 6 స్థానాన్ని సంపాదించుకున్నారు.  ఆ త‌ర్వాత స‌ర్వేలో నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ పాపుల‌ర్ హీరోలుగా నిలిచారు. 

టాప్ హీరోయిన్ స‌మంత (Samantha)

ఇక హీరోయిన్ల‌లో పాపుల‌రిటీలో టాప్ ప్లేస్ స‌మంత‌దే. సామ్(Samantha) మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ఫ్యామిలీ మ్యాన్2 సినిమాతో మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. స‌మంత త‌ర్వాత రెండో స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఉన్నారు. ఆ త‌ర్వాత స్థానాల్లో అనుష్క, పూజా హెగ్డే, రష్మిక మందాన టాప్ 5 పొజిషన్స్ లో ఉన్నారు. త‌మ‌న్నా, కీర్తి సురేష్, సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్, రాశీఖ‌న్నా వ‌రుస‌గా టాప్ 6 నుంచి టాప్ 10 ప్లేస్‌లో కొన‌సాగారు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!