అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్న చిరంజీవి (Chiranjeevi)! అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఏర్పాట్లు

Updated on Sep 29, 2022 12:45 PM IST
అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించనున్నారు
అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించనున్నారు

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అక్టోబర్‌‌ 1వ తేదీన అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నారు. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి మెగాస్టార్‌‌గా ఎదిగిన చిరంజీవి సినీ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. చిరంజీవి భార్య సురేఖ.. ప్రముఖ హాస్యనటుడు, దివంగత అల్లు రామలింగయ్య కూతురు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సినిమాల్లో రాణిస్తున్నారు. అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం కొన్నేళ్ల క్రితం అల్లు స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. 2022, అక్టోబర్ 1వ తేదీన అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రారంభించనున్నారు

ఏర్పాట్లు పూర్తి..

అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా అల్లు స్టూడియోను ప్రారంభించాలని నిర్ణయించింది. అల్లు వారి కుటుంబమంతా హాజరుకానున్న ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుంచి కూడా దాదాపుగా అందరూ హాజరవుతారని తెలుస్తోంది. అయితే అల్లు స్టూడియోస్‌ను ఎవరు ప్రారంభించబోతున్నారని వార్తలు కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేశాయి.

అల్లు స్టూడియోస్‌ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చేతుల మీదుగా ప్రారంభించడానికి అల్లు ఫ్యామిలీ ఏర్పాట్లు చేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పుష్ప2 సినిమా షూటింగ్‌.. అల్లు స్టూడియోస్‌లో జరిగే మొదటి సినిమా షూటింగ్‌ అని తెలుస్తోంది. అక్టోబర్‌‌ 1వ తేదీని ప్రారంభం కానున్న అల్లు స్టూడియోస్ అక్టోబర్‌‌ 10వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం గాడ్‌ఫాదర్ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉన్నారు చిరంజీవి. ఆయన హీరోగా నటించిన గాడ్‌ఫాదర్ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్‌‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే అనంతపురంలో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.

Read More : ప్రతి అభిమానీ గాడ్‌ఫాదరే.. నా వెనుక లక్షల మంది గాడ్‌ఫాదర్స్ ఉన్నారు: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!