కామెడీ కింగ్ రాజు శ్రీవాస్తవ్‌ (Raju Srivastav) క‌న్నుమూత‌.. సేవా కార్యక్రమాలకు పేరొందిన పాపులర్ నటుడు !

Updated on Sep 21, 2022 07:14 PM IST
రాజు శ్రీవాస్తవ్‌ (Raju Srivastav)  ఆగ‌స్టు 10 న జిమ్ చేస్తున్న స‌మ‌యంలో గుండెపోటుతో ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు.
రాజు శ్రీవాస్తవ్‌ (Raju Srivastav)  ఆగ‌స్టు 10 న జిమ్ చేస్తున్న స‌మ‌యంలో గుండెపోటుతో ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు.

Bollywood: బాలీవుడ్‌ ప్ర‌ముఖ‌ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ్‌ (Raju Srivastav)  కన్నుమూశారు. గ‌త కొన్ని రోజులుగా వెంటిలేట‌ర్‌పై ఉన్నశ్రీవాస్తవ్‌ ఇవాళ ఉద‌యం తుది శ్వాస విడిచారు. త‌న కామెడీతో పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వించే టాలెంట్ ఉన్న న‌టుడు రాజు శ్రీవాస్తవ్‌. శ్రీవాస్తవ్‌ మృతికి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలుపారు. భారతదేశంతో పాటు ప‌లు దేశాల్లో రాజు శ్రీవాస్తవ్ ఎన్నో స్టేజ్ షోలు నిర్వ‌హించారు. "స్వచ్ఛ భారత్ అభియాన్" కోసం వివిధ టీవీ ప్రకటనలు, సామాజిక సేవా సందేశాల‌ను అందిస్తూ వీడియోల‌ను రిలీజ్ చేశారు. 

గుండెపోటుతో ఆస్ప‌త్రిలో చేరిన శ్రీవాస్తవ్‌

రాజు శ్రీవాస్తవ్‌ (Raju Srivastav)  ఆగ‌స్టు 10 న జిమ్ చేస్తున్న స‌మ‌యంలో, గుండెపోటుతో ఒక్క‌సారిగా కుప్పకూలిపోయారు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు శ్రీవాస్తవ్‌ను వెంట‌నే ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గుండె స‌మ‌స్య‌ల‌తో పాటు బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవ‌డంతో ఆయన కోమాలోకి  వెళ్లారు. చాలా రోజులు వెంటిలేట‌ర్‌పై ఉన్న శ్రీవాస్తవ్‌ ఈరోజు ఉద‌యం తుది శ్వాస విడిచారు. 

శ్రీవాస్తవ్‌ గొప్ప క‌మెడియ‌న్‌

శ్రీవాస్తవ్‌ గొప్ప న‌టుడ‌ని.. త‌న‌తో ఎంతో స‌న్నిహితంగా ఉండేవార‌ని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. సామాజిక సేవకు, దానగుణానికి శ్రీవాస్తవ్ పెట్టింది పేరని తెలిపారు. ప్రజా కార్యక్రమాలలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉండేవార‌న్నారు. ఇదే క్రమంలో శ్రీవాత్స‌వ్‌కు నివాళి అర్పించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

సత్య ప్రకాష్ శ్రీవాస్తవ్‌ (Raju Srivastav) 1963 డిసెంబరు 25 న జ‌న్మించారు. హాస్యనటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించారు. 2005లో జ‌రిగిన గ్రేట్ ఇండియ‌న్ లాఫ‌ర్ ఛాలెంజ్ కామెడీ షోతో పాపుల‌ర్ అయ్యారు. మైనే ప్యార్ కియా, బాజీఘ‌ర్‌, బాంబే టు గోవా, ఆమ్‌దాని అఠానీ ఖ‌ర్చా రుప‌య్యా లాంటి సినిమాల్లో న‌టించారు. బిగ్ బాస్ మూడ‌వ సీజ‌న్‌లో కంటెస్టెంట్‌గా పోటీప‌డ్డారు. 

Read More: బాలీవుడ్‌లో మరో క్రేజీ సినిమాలో సమంత (Samantha)కు ఆఫర్.. ఈసారి యువరాణి క్యారెక్టర్‌‌లో కనిపించనున్న సామ్

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!