Sonakshi Sinha: బాలయ్య మూవీలో సోనాక్షి సిన్హా నటిస్తున్నారంటూ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..!

Updated on Dec 03, 2022 11:59 AM IST
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna)  మూవీ నుంచి తనను తొలగించారని వస్తున్న వార్తలపై సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఆగ్రహం వ్యక్తం చేశారు
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) మూవీ నుంచి తనను తొలగించారని వస్తున్న వార్తలపై సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఆగ్రహం వ్యక్తం చేశారు

బాలీవుడ్ సినిమాలను చూసే వారికి సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) పరిచయం అక్కర్లేని పేరు. వెటరన్ హీరో శత్రుఘ్నా సిన్హా కూతురిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకున్నారు. సినిమాలతోపాటు పలు డ్యాన్స్ వీడియోలతోనూ యూత్ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సోనాక్షి.. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ కావడంతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు. 

‘దబాంగ్’ తర్వాత ‘రౌడీ రాథోడ్’, ‘సన్ ఆఫ్ సర్దార్’ చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన సోనాక్షి సిన్హా.. ‘లూటెరా’ మూవీతో తన సత్తాను మరోమారు చాటారు. ఇక రజినీకాంత్ చిత్రం ‘లింగా’తో దక్షిణాదిలోనూ సోనాక్షి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ మధ్య ఆమెకు అవకాశాలు తగ్గాయి. ‘లింగా’ తర్వాత సౌత్‌లో మరో మూవీని చేయని సోనాక్షీకి.. ఇప్పుడో బిగ్ ఆఫర్ దక్కిందని వార్తలు వస్తున్నాయి. 

 సోనాక్షి సిన్హా.. ‘లూటెరా’ మూవీతో తన సత్తాను మరోమారు చాటారు

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) సరసన నటించే చాన్స్‌ను సోనాక్షి సిన్హా దక్కించుకున్నారని వినికిడి. బాలయ్య 108 (NBK 108)వ మూవీలో ఆమె యాక్ట్ చేయబోతున్నారని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఈ చిత్రంలో నటించాల్సిందిగా.. సోనాక్షీని మూవీ మేకర్స్ సంప్రదించారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నుంచి ఆమెను తొలగించారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర బృందం వీటిని అధికారికంగా ధృవీకరించలేదు. తాజాగా ఈ అంశంపై సోనాక్షి స్పందించారు. 

బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరసన నటించే చాన్స్‌ను సోనాక్షి సిన్హా దక్కించుకున్నారని వినికిడి

బాలయ్య సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని సోనాక్షి సిన్హా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె తెలియజేశారు. ఆ కథనాలన్నింటిలో నిజం లేదని ఆమె కొట్టిపారేశారు. ఈ సినిమా నుంచి తనను తప్పించారంటూ వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు. మేకర్స్ తనను ఎప్పుడూ సంప్రదించలేదని.. అలాంటప్పుడు ఇంకా ఎలా తొలగిస్తారని చెబుతూ పుకార్లన్నింటికీ స్వస్తి పలికారు. మరి, సోనాక్షి వివరతోనైనా ఈ రూమర్స్ ఆగుతాయేమో చూడాలి. 

Read more: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి మరో ప్రతిష్టాత్మక అవార్డు.. !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!