Rakul Preet Singh: డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానున్న రకుల్ ప్రీత్ సింగ్ మూవీ!.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..?

Updated on Dec 02, 2022 12:14 PM IST
తేజస్‌ ప్రభ విజయ్‌ దేవాస్కర్‌ దర్శకత్వంలో రకుల్  నటిస్తున్న ‘ఛత్రీవాలి’ (Chhatriwali) సినిమా బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కుతోందని సమాచారం
తేజస్‌ ప్రభ విజయ్‌ దేవాస్కర్‌ దర్శకత్వంలో రకుల్ నటిస్తున్న ‘ఛత్రీవాలి’ (Chhatriwali) సినిమా బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కుతోందని సమాచారం

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పరిచయం లేని నటి. తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ ఆమె స్టార్ హోదాను తెచ్చుకున్నారు. తనదైన శైలిలో హుషారైన నటనకు తోడు డ్యాన్సులు, స్టన్నింగ్ లుక్స్‌తో యూత్ ఆడియెన్స్‌లో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. అందుకే ఆమెను సోషల్ మీడియాలో ఎంతో మంది అభిమానులు ఫాలో అవుతున్నారు.  

‘కెరటం’ సినిమాతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన రకుల్.. ఆ తర్వాత నుంచి వరుస అవకాశాలను దక్కించుకుంటూ అగ్ర కథానాయికగా ఎదిగారు. ‘లౌక్యం’, ‘నాన్నకు ప్రేమతో’, ‘ధృవ’ వంటి హిట్లను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత రకుల్ నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో ఆమె బాలీవుడ్‌పై తన దృష్టిని సారించారు. అక్కడ మంచి అవకాశాలనే దక్కించుకున్నారు. అయితే అక్కడ కూడా ఆమె యాక్ట్ చేస్తున్న చిత్రాలు అంతగా ఆడడ్లేదు.

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) పరిచయం లేని నటి

సీనియర్ హీరో అజయ్ దేవగణ్, యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో వచ్చిన ‘థ్యాంక్ గాడ్’లో రకుల్ నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలాఉంటే.. మరో సినిమాతో హిందీ ఆడియెన్స్‌ను పలకరించేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. రకుల్ నటిస్తున్న ‘ఛత్రీవాలి’ (Chhatriwali) అనే సినిమా త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. తేజస్ ప్రభ విజయ్ దేవాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ త్వరలో జీ5 ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి స్ట్రీమింగ్ మొదలవుతుందని వినికిడి. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 

‘హర్యానా బ్యాక్‌డ్రాప్‌లో ‘ఛత్రీవాలి’ కథనం సాగుతుంది. ఓ కండోమ్‌ కంపెనీలో క్వాలిటీ హెడ్‌గా పని చేసే పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించారు. ఆరోగ్యకరమైన శృంగారం గురించిన కొన్ని అంశాలను మా సినిమాలో చూపించాం. అలాగే ఎయిడ్స్‌ వ్యాధి, సెక్స్‌ అంశాలపై అవగాహన కలిగేంచేలా సందేశాత్మకంగా కూడా మా మూవీ ఉంటుంది’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. మరి, సరైన హిట్స్ లేక సతమతమవుతున్న రకుల్.. ‘ఛత్రీవాలి’తోనైనా ప్రేక్షకుల ఆదరణను దక్కించుకుంటారో లేదో చూడాలి. 

Read more: 1 Year For Akhanda: 'అఖండ' విడుదలై ఏడాది.. బాలకృష్ణ (Balakrishna) నటనకు దద్దరిల్లిన థియేటర్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!