అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న ‘పుష్ప2’ (Pushpa2) రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?

Updated on Oct 15, 2022 04:13 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2  షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిశాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నారని టాక్
అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2 షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిశాయి. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల చేయనున్నారని టాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలై సూపర్‌‌హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అల్లు అర్జున్‌ సరసన రష్మికా మందాన హీరోయిన్‌గా నటించారు. పుష్ప సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ మేనరిజం, యాక్టింగ్‌కు అభిమానులు, సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. ఆ సినిమాలోని పాటలు, డాన్స్‌లను సెలబ్రిటీలు సైతం అనుకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పుష్ప సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌తో అల్లు అర్జున్ క్రేజ్‌తోపాటు రష్మికా మందాన ఇమేజ్‌ కూడా పెరిగింది. ఈ క్రేజ్‌తో రష్మికకు బాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్ పక్కన గుడ్‌బై సినిమాలో నటించి ఆకట్టుకున్నారు.

అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న పుష్ప2  షూటింగ్‌ పూజా కార్యక్రమాలు ఇప్పటికే ముగిశాయి. పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాను విడుదల చేయనున్నారని టాక్

స్క్రిప్ట్‌లో మార్పులు..

ప్రస్తుతం పుష్ప సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. పుష్ప2 (Pushpa2) షూటింగ్‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగి చాలా కాలమే అయ్యింది. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు. పుష్ప2 రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బన్నీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప సినిమాకు వచ్చిన క్రేజ్‌తో పుష్ప2 సినిమా కథలో సుకుమార్ మార్పులు చేశారని సమాచారం. రెగ్యులర్ షూటింగ్ ఆలస్యంగా మొదలుకావడానికి ఇది కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

అక్టోబర్‌‌ 20వ తేదీ నుంచి పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. 20వ తారీఖు నుంచి నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని టాక్. అల్లు అర్జున్ (Allu Arjun), రష్మికా మందాన కూడా ఈ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. పుష్ప2 సినిమాలో ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Read More : నా అభిమాన నటుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇన్‌స్టా చిట్‌చాట్‌లో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!