నా అభిమాన నటుడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఇన్‌స్టా చిట్‌చాట్‌లో బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్

Updated on Sep 25, 2022 05:27 PM IST
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. సినీ ప్రముఖులతోపాటు క్రికెటర్లు కూడా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు
పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. సినీ ప్రముఖులతోపాటు క్రికెటర్లు కూడా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. ఈ పేరు చెబితే అభిమానులకే కాదు.. సెలబ్రిటీలకు కూడా ఎనర్జీ వచ్చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. డాన్స్, కమిట్‌మెంట్, హార్డ్‌ వర్క్, నటన, వైవిద్యభరితమైన కథలను ఎంపిక చేసుకోవడం, అభిమానులతో కలిసిపోవడం ఇవన్నీ అల్లు అర్జున్‌ను స్టార్ హీరోను చేశాయి. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు బన్నీ.

అల్లు అర్జున్‌కు టాలీవుడ్‌లోనే కాదు ఇతర భాషల్లో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇక, అల్లు అర్జున్‌ను అభిమానించే సెలబ్రిటీల లిస్ట్‌ కూడా చిన్నదేం కాదు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు ఆ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పారు కూడా. తాజాగా మరో బాలీవుడ్ స్టార్‌‌ కూడా సౌత్‌లో బన్నీ తన ఫేవరెట్ యాక్టర్ అని చెప్పారు.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్‌ (Allu Arjun) క్రేజ్‌ విపరీతంగా పెరిగింది. సినీ ప్రముఖులతోపాటు క్రికెటర్లు కూడా బన్నీకి ఫ్యాన్స్ అయిపోయారు

ఇన్‌స్టా చిట్‌చాట్‌లో..

వైవిద్యభరితమైన యాక్షన్ సినిమాలతో అభిమానులను అలరిస్తుంటారు టైగర్ ష్రాఫ్. అదే సమయంలో సోషల్ మీడియాలో తన ఫిట్‌నెస్  వీడియోలు అప్‌లోడ్ చేస్తూ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంటారు కూడా. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో టైగర్ ష్రాఫ్ అభిమానులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.

ఈ చిట్‌చాట్‌లో సౌత్‌లో మీకు ఇష్టమైన నటుడు ఎవరు అని అభిమాని ప్రశ్నించారు. దానికి ‘ఐకాన్ స్టార్ అల్లు అర్జున్’ అని బదులిచ్చారు ష్రాఫ్. టైగర్ ష్రాఫ్ ఇచ్చిన సమాధానాన్ని ఆ  అభిమాని తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం అది వైరల్ అయ్యింది.

 అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప: ది -రూల్‌ సినిమా చేస్తున్నారు. పుష్ప: ది రైజ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన సుకుమార్‌‌ సెకండ్ పార్ట్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.  మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌‌పై తెరకెక్కుతున్న పుష్ప2 సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతోంది. 

Read More : పుష్ప2 తర్వాత అల్లు అర్జున్‌(Allu Arjun)తో సినిమా చేయాలని త్రివిక్రమ్(Trivikram Srinivas) ప్లాన్ చేస్తున్నారా?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!