అర్జున్‌రెడ్డి చూసినప్పుడే విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యా: పూరీ జగన్నాథ్
కష్టాల్లో అండగా నిలబడి.. తనను ఒక తండ్రిలా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఆదుకున్నారని డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన ‘లైగర్’ ఫ్యాన్ డమ్ మీట్‌లో పూరీ.. విజయ్ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.
తన భార్య లావణ్య చెప్పడం వల్లే ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశానని చెప్పారు. ఆ సినిమా చూస్తున్నప్పుడే విజయ్‌తో సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయానని చెప్పుకొచ్చారు పూరి. తనకు ఉన్న అప్పుల గురించి తెలుసుకొని విజయ్ రూ.2 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి పంపించేశారని తెలిపారు.
ముందుగా కరణ్ జోహార్‌కు థ్యాంక్స్ చెప్పాలి. ‘లైగర్’ సినిమా విషయంలో ఆయన చాలా సపోర్ట్ చేశారు. ‘కొత్త దర్శకులు వస్తున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. నువ్వు వెనుకబడిపోతున్నావ్. పక్క వాళ్ల సినిమాలు కూడా చూస్తూ ఉండు. ఎవరో సందీప్ రెడ్డి వంగా అట. కొత్తగా వచ్చాడు. విజయ్ అనే యువ నటుడితో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీశారు. సినిమా చాలా బాగుంది. మన ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే మూడు సార్లు ఆ సినిమా చూశాం’ అని ఓ రోజు నా భార్య తిట్టింది.
విజయ్‌తో సినిమా చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యా..
అప్పుడే అర్జున్ రెడ్డి సినిమా చూశాను. 45 నిమిషాల తర్వాత సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనిపించలేదు. కేవలం విజయ్ యాక్టింగ్ పైనే నా ఫోకస్ నిలిచిపోయింది. అతడి నటనలో నిజాయితీ ఉందనిపించింది. విజయ్‌తో ఎలాగైనా సినిమా చేయాలనిపించింది. ‘లైగర్’ సినిమాలో ఏ సీన్ చూసినా.. ఎక్కడా విజయ్ నటనలో పొగరు కనిపించదు. కేవలం నిజాయితీ మాత్రమే కనిపిస్తుంది.
విజయ్ రియల్ లైఫ్‌లోనూ హీరోనే. ఒక నిర్మాతగా అతడికి ఓసారి రూ.కోటి పంపిస్తే.. ‘నాకు ఇప్పుడే వద్దు ఈ డబ్బుని ముందు సినిమా కోసం ఖర్చుపెట్టండి. నేను తర్వాత తీసుకుంటా’ అని చెప్పారు. ఆ తర్వాత మరోసారి రూ.రెండు కోట్లు పంపిస్తే నాకు అప్పులున్నాయని తెలుసుకుని.. ‘ఈ డబ్బుతో మీరు ముందు అప్పులు తీర్చేయండి’ అని ఆ డబ్బుని వెనక్కి పంపించేశారు. సినిమా షూటింగ్ జరుగుతునన్ని రోజులు నాకెంతో సపోర్ట్ చేశారు. నన్ను ఒక తండ్రిలా చూసుకున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లాంటి నటుడిని నేనెక్కడా చూడలేదు’ అని చెప్పుకొచ్చారు పూరీ జగన్నాథ్.
Read More : విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ సినిమా సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే