విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లైగర్ సినిమా సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే

Updated on Aug 06, 2022 01:18 PM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషించారు
విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషించారు

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లైగర్. పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అనన్యా పాండే హీరోయిన్‌గా నటించారు. ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీబిజీగా ఉంది చిత్ర యూనిట్.

విజయ్ దేవరకొండ ‘లైగర్’ మూవీ సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమాకు సెన్సార్ అధికారులు U/A సర్టిఫికెట్‌ కేటాయించారు. సినిమా రన్‌టైమ్ 2 గంటల 20 నిమిషాలు. ఫస్ట్‌ హాఫ్‌ 1 గంట 15 నిమిషాలు కాగా, సెకండ్ హాఫ్  1 గంట 5 నిమిషాలు. ఈ సినిమాలో ఏడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నాయని ప్రొడక్షన్ హౌస్ తెలిపింది. పాన్ ఇండియా స్టార్‌‌గా విజయ్ దేవరకొండ నటిస్తున్న 'లైగర్‌‌' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'సాలా క్రాస్‌బ్రీడ్' ట్యాగ్ లైన్‌తో లైగర్‌‌ సినిమా తెరకెక్కింది.

విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషించారు

ఎంట్రీ ఇస్తున్న మైక్‌ టైసన్..

లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ 'లైగర్' సినిమాతో భారతీయ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. విజయ్ పెర్ఫార్మెన్స్, యాక్షన్, డ్యాన్స్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని అంటోంది చిత్ర యూనిట్. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్, నత్తితో చెప్తున్న డైలాగులు, బాడీ లాంగ్వేజ్‌ ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటిస్తున్న 'లైగర్' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌ లుక్, టీజర్, ట్రైలర్, పాటలు వైరల్ అయ్యాయి. విజయ్‌ కెరీర్‌‌లో ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమా 'లైగర్'. లైగర్ సినిమాను కరణ్‌ జోహార్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read More : ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), అనన్యా పాండే.. ఆసక్తిగా ప్రోమో

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!