కమల్‌ హాసన్‌ ‘రాజా చెయ్యి వేస్తే’ తమిళ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన శృతి హాసన్ (Shruti Haasan)..వీడియో వైరల్

Updated on Sep 04, 2022 03:04 PM IST
శృతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే107లో హీరోయిన్‌గా నటిస్తున్నారు
శృతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే107లో హీరోయిన్‌గా నటిస్తున్నారు

‘అనగనగా ఒక ధీరుడు’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు శ్రుతిహాసన్ (Shruti Haasan). ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయలేకపోయినా.. తన అందం, అభినయంతో ప్రేక్షకుల వద్ద మంచి మార్కులే కొట్టేశారు ఈ బ్యూటీ.

పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ అందుకున్న శృతి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారారు. స్టార్‌‌ హీరోల సరసన నటించే చాన్స్‌లు దక్కించుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. శృతిహాసన్ ప్రస్తుతం టాలీవుడ్, కోలివుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ నటిస్తున్నారు.

శృతి హాసన్ (Shruti Haasan) ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్‌బీకే107లో హీరోయిన్‌గా నటిస్తున్నారు

ఎన్‌బీకే 107లో చాన్స్‌..

గోపీచంద్ మలినేని – మాస్‌ మహారాజా రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన క్రాక్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు శృతి. పవర్‌‌స్టార్‌‌ పవన్‌ కల్యాణ్‌తో నటించిన ‘వకీల్‌సాబ్’ సినిమాలో చాన్స్ దక్కించుకుని హిట్‌ కొట్టారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బీకే107లో నటిస్తున్నారు శృతిహాసన్.

సోషల్ మీడియాలో శృతిహాసన్‌ చాలా యాక్టివ్‌గా ఉంటారు. రకరకాల పోస్ట్‌లు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా శృతి పోస్ట్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో శృతి తన డాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ లేటెక్స్ జంప్ సూట్‌తో శృతి డ్యాన్స్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

అయితే శృతి ఏ పాటకు డాన్స్ చేసిందో తెలుసుకున్న ఫ్యాన్స్ మరింత ఫిదా అవుతున్నారు. తన తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన రాజా చెయ్యి వేస్తే అనే పాట తమిళ వెర్షన్‌ క్లాసిక్ ట్యూన్‌కు శృతిహాసన్ (Shruti Haasan) స్టెప్పులు వేశారు.  

Read More : ‘సలార్’ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది.. క్యారెక్టర్ గురించి ఇప్పుడే చెప్పలేను: శృతిహాసన్ (Shruti Haasan)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!