శృతిహాసన్ (Shruti Haasan) ఒక్కో సినిమాకు అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్నారా? ఇవ్వడానికి రెడీగా నిర్మాతలు

Updated on Aug 21, 2022 08:14 PM IST
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కడంతో శృతిహాసన్ (Shruti Haasan) రెమ్యునరేషన్‌ పెంచేసింది
వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కడంతో శృతిహాసన్ (Shruti Haasan) రెమ్యునరేషన్‌ పెంచేసింది

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan). కెరీర్ మొదట్లో వరుసగా ఫ్లాప్ సినిమాలను చేసి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకున్నారు కూడా. తనలోని టాలెంట్‌ను బయటపెడుతూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అగ్ర హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో  బిజీగా గడుపుతున్నారు.

కెరియర్ మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్న శృతి హాసన్‌ క్రాక్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాలను దక్కించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్, బాలకృష్ణ NBK107, మెగాస్టార్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు శృతి. అగ్ర హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాలలో నటించడంతో ఇండస్ట్రీలో శృతికి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.

వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కడంతో శృతిహాసన్ (Shruti Haasan) రెమ్యునరేషన్‌ పెంచేసింది

భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్న శృతిహాసన్ తన రెమ్యునరేషన్ పెంచేసిందని తెలుస్తోంది. ఇది వరకు ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే వారు శృతి. అయితే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారట. శృతిహాసన్ (Shruti Haasan) రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నా ఆమెకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఆమె అడిగిన రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

Read More : Shruti Haasan: 'ప్రశాంత్ నీల్ మరో ప్రపంచాన్ని సృష్టిస్తారు'.. సలార్ హీరో, దర్శకుడిపై శృతి హాసన్ వ్యాఖ్యలు!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!