ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు.. అభిమానులకు, ఇండస్ట్రీకి రుణపడి ఉంటా: శృతిహాసన్‌ (Shruti Haasan) వీడియో

Updated on Jul 25, 2022 07:46 PM IST
అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌‌కి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు శృతిహాసన్ (Shruti Haasan)
అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌‌కి వచ్చి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు శృతిహాసన్ (Shruti Haasan)

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు శృతి హాసన్‌ (Shruti Haasan). ముందు హిందీ సినిమాలో నటించిన శృతి.. తర్వాత సౌత్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యాక్టర్‌‌గా, సింగర్‌‌గా, ప్రొడ్యూసర్‌‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా, యాంకర్‌‌గా, తనలోని టాలెంట్‌తో అభిమానులను అలరించారు. కాగా శ్రుతీ ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు పూర్తయ్యింది.

ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు, ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి ధన్యవాదాలు చెప్పారు శృతి. ఈ క్రమంలో ఒక ఆసక్తికర వీడియో షేర్‌ చేశారు. ఆ వీడియోలో శృతి చేసిన పలు కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

‘13 సంవత్సరాలు.. అద్భుతంగా ఉంది. అసలు ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తానని అనుకోలేదు. దీని కోసమే పుట్టకపోయినా సినిమాను ప్రేమించడం నేర్చుకున్నాను. ఇండస్ట్రీకి, అభిమానులకు రుణపడి ఉన్నాను. ఇన్ని సంవత్సరాల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. గెలుపు, ఓటములను ఎలా తీసుకోవాలి. ఆత్మస్థైర్యంతో ఎలా ముందుకు సాగాలి. కథలు చెప్పే వాళ్లను ఎలా అభినందించాలి. ఎప్పుడూ కలవని మనుషులతో ఎలా మెలగాలి. ఇవన్నీ నేను ఇండస్ట్రీకి వచ్చాక నేర్చుకున్నవే. నేను పొందుతున్న ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను‘ అంటూ తన మదిలోని భావాలను పంచుకున్నారు శృతి.

శృతిహాసన్ (Shruti Haasan)

‘ఈనాడు’తో సింగర్‌‌గా..

’నా ఈ ప్రయాణంలో నన్ను ప్రేమించిన వారికి, ఆప్యాయతను కురిపించిన వారికి, మద్దతుగా నిలిచిన వారికి.. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా కెరీర్‌లో ఈ 13 సంవత్సరాలు చాలా విలువైనవి. నన్ను ప్రోత్సహించిన వారికి చాలా థ్యాంక్స్’ అని చెప్పారు శృతి. ‘ఈనాడు’ సినిమాతో సింగర్‌గా సౌత్‌ ఇండస్ట్రీకి పరిచమయ్యారు శృతి (Shruti Haasan).

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా, ఆ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఆ తర్వాత 7th సెన్స్‌, ఓ మై ఫ్రెండ్‌ సినిమాల్లో నటించినా శృతికి పెద్దగా గుర్తింపు రాలేదు. శృతి నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్‌ కావడంతో, ఆమెను ఐరన్‌ లెగ్‌ అంటూ ట్రోల్‌ చేశారు కూడా. పవన్‌ కల్యాణ్‌తో నటించిన 'గబ్బర్‌ సింగ్‌ ' సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో,  ఆ రోజులలో మళ్లీ ఫామ్‌‌లోకి వచ్చారామె. ఆ సినిమాతోనే తొలి కమర్షియల్‌ హిట్‌ అందుకున్నారు శృతిహాసన్  (Shruti Haasan).  

Read More : స్టార్ డమ్‌ ఉన్నా సంతోషంగా లేను: రజినీకాంత్‌ (Rajinikanth) కామెంట్స్ వైరల్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!