అమెజాన్‌ ఓటీటీలో యశ్‌ (Yash) కేజీఎఫ్‌2.. అదనంగా చెల్లిస్తేనే ఎర్లీ యాక్సెస్ అంటూ ప్రైమ్‌ షరతు

Updated on May 16, 2022 08:46 PM IST
యశ్కే‌ (Yash) జీఎఫ్‌2 అమెజాన్‌ ఓటీటీ పోస్టర్
యశ్కే‌ (Yash) జీఎఫ్‌2 అమెజాన్‌ ఓటీటీ పోస్టర్

బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది యశ్‌ హీరోగా వచ్చిన ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’. యశ్‌(Yash) హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇప్పటివరకు రూ.1200 కోట్లు వసూలు చేసింది. ఓటీటీలోకి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్‌ న్యూస్‌ వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘కేజీయఫ్‌2’ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.  ఈ సినిమా ఇప్పటికిప్పుడే చూడాలంటే మాత్రం ఎర్లీ యాక్సెస్‌ కోసం అదనంగా రూ.199 చెల్లించాలి.  దీంతో ఓటీటీలో ‘కేజీయఫ్‌2’ వచ్చేసిందని ఆనందపడిన వాళ్లు షాకవుతున్నారు.  

 ‘కేజీయఫ్‌2’ చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఒకసారి సినిమా చూడటం మొదలుపెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. ‘కేజీయఫ్‌2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా పూర్తిగా చూసేయాలి. మే 20వ తేదీన  జీ5 వేదికగా రాబోతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా T-VOD ప్రకారమే అందుబాటులో  తీసుకురానున్నట్టు జీ5 తెలిపింది.

ఇక,  హోంబ‌లే ఫిలిమ్స్, విజ‌య్ కిర‌గాంధూర్ క‌లిసి కేజీఎఫ్‌2 సినిమా నిర్మించారు. త‌మిళ్ న్యూ ఇయ‌ర్ రోజు అంటే ఏప్రిల్ 14 సినిమా రిలీజ్ చేశారు. 10,000 ధియేట‌ర్ల‌లో ప్ర‌పంచ వ్యాప్తంగా కేజీఎఫ్2ను రిలీజ్ చేశారు. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్, తెలుగు, మ‌ళ‌యాళంలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లోనే రూ.546 కోట్లు వ‌చ్చేశాయి. ఇక రెండో వారంలో వేయి కోట్ల రూపాయ‌ల‌ను సొంతం చేసుకుంది కేజీఎఫ్‌2.

ఉత్త‌రాదిలో కేజీఎఫ్‌2 రూ.350 కోట్ల వ‌సూళ్లు చేసిందంటే మామూలు విష‌యం కాదు.  హిందీ సినిమాల చ‌రిత్ర‌లోనే ఇంత పెద్ద మొత్తంలో ఏ సినిమా వ‌సూళ్లు చేయ‌లేద‌ట‌. ప్ర‌తీ రోజు క‌లెక్ష‌న్ల సునామీ పెరుగుతూనే ఉంది కానీ... రాఖీభాయ్‌కి అడ్డు వెళ్లే ద‌మ్ము ఉన్న సినిమా ఇంకా రాద‌ని సినీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. య‌శ్(Yash)అభిమానుల వ‌ల్లే ఇదంత సాధ‌మైంద‌ని అంటున్నారు.  

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!