Prashanth Neel : ఏపీలోని కంటి ఆసుపత్రికి రూ. 50 లక్షల విరాళాన్ని అందించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ !

Updated on Aug 17, 2022 03:22 PM IST
Prashanth Neel : ప్రశాంత్ నీల్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలోని నీలకంఠాపురం. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కొడుకే ప్రశాంత్.
Prashanth Neel : ప్రశాంత్ నీల్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాలోని నీలకంఠాపురం. మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కొడుకే ప్రశాంత్.

భారతీయ చిత్ర పరిశ్రమలో లెక్కలేనన్ని రికార్డులను సాధించిన చిత్రం ఏదైనా ఉందంటే, అది కేజీఎఫ్ 2 అనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.1300 కోట్లకు పైగా బాక్సాఫీసు కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్‌కు వరుస ఆఫర్లు సైతం తలుపు తట్టాయి. 

ప్రస్తుతం భారతదేశంలోని టాప్ డైరెక్టర్లలో ఎస్ ఎస్ రాజమౌళితో పాటు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కూడ ఒకరు. ఇటీవలే ప్రభాస్‌తో కలిసి 'సలార్' సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ప్రశాంత్, తన తదుపరి ప్రాజెక్టు ఎన్టీఆర్‌తో ఉంటుందని తెలిపారు. అలాగే పలు బాలీవుడ్ హీరోలు కూడా ప్రశాంత్ దర్శకత్వంలో వర్క్ చేయడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. 

రాజకీయ కుటుంబమే ..

ఈ మధ్యకాలంలో ప్రశాంత్ నీల్ ఆంధ్రప్రదేశ్‌ని సందర్శించారు. తన తండ్రి స్వగ్రామమైన సత్యసాయి జిల్లా నీలకంఠాపురానికి విచ్చేసి ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి రూ.50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. 

విచిత్రమేంటంటే, ప్రశాంత్ నీల్ కూడా తెలుగు వ్యక్తే. మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడైన సుభాష్ రెడ్డి తనయుడైన ప్రశాంత్ పుట్టి, పెరిగింది అంతా కూడా బెంగళూరు కావడంతో అక్కడే సెటిలయ్యారు.

ప్రశాంత్ సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ 

ప్రశాంత్ నీల్‌కు (Prashanth Neel) ఓ సెంటిమెంట్ కూడా ఉంది. ఏదైనా సినిమాని టేకప్ చేసేముందు ఆయన నీలకంఠాపురంలోని తన తండ్రి సమాధి వద్దకు వచ్చిన నివాళులు అర్పించి వెళ్తారట. ప్రశాంత్ నీల్ "ఉగ్రం" సినిమాతో కన్నడంలో తొలి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. 

Read More: ఎన్టీఆర్‌‌ (Junior NTR), ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్ మొదలయ్యేది ఎప్పటి నుంచంటే.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!