టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించనున్న హీరో నితిన్ (Nithiin).. ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కోసమేనా!

Updated on Jul 13, 2022 07:26 PM IST
జ‌యం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చి దిల్‌, ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, భీష్మ వంటి హిట్ సినిమాల‌తో అల‌రించాడు హీరో నితిన్‌ (Nithiin)
జ‌యం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి దిల్‌, ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, భీష్మ వంటి హిట్ సినిమాల‌తో అల‌రించాడు హీరో నితిన్‌ (Nithiin)

'జ‌యం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చి దిల్‌, ఇష్క్‌, గుండె జారి గ‌ల్లంత‌య్యిందే, భీష్మ వంటి హిట్ సినిమాల‌తో అల‌రించాడు హీరో నితిన్‌ (Nithiin). ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తోన్న మాచర్ల నియోజకవర్గం రిలీజ్‌‌‌కు సిద్దమవుతున్న విషయం తెల్సిందే. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ల పనితో ఇప్పుడు నితిన్ బిజీగా మారాడు.

2003లో తేజ ద‌ర్శకత్వంలో వ‌చ్చిన 'జ‌యం' సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌య్యారు నితిన్. వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న నితిన్‌ ఖాతాలో 'భీష్మ' తర్వాత మంచి హిట్ లేదు. దీంతో మంచి హిట్ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు నితిన్.

నితిన్ మాచర్ల నియోజకవర్గం సినిమా పోస్టర్

ఎలాగైనా హిట్ కొట్టాలని..

నితిన్‌కు (Nithiin) ఇప్పుడు హిట్ చాలా అవసరం. అందుకే 'మాచర్ల నియోజకవర్గం'ను ఎలా అయినా హిట్ చేయాలని భావిస్తున్నారు. ఎలాంటి సినిమాకు అయినా.. ప్రచారం చాలా అవసరం. మొన్నటికి మొన్న 'పెళ్లి సందD' టీమ్ సీరియల్స్‌లో కనిపించి మెప్పించింది.

నిన్నటికి నిన్న 'ఎఫ్ '3 సినిమా ప్రమోషన్లలో భాగంగా అనిల్ రావిపూడి కూడా బుల్లితెరపై కనిపించి అల‌రించాడు. ఈ లిస్టులోకి చేరిపోయాడు యంగ్ హీరో నితిన్. నితిన్ కూడా టీవీ సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

'మాచర్ల నియోజకవర్గం' సినిమా ప్రమోషన్స్ కోసం, నితిన్ బుల్లితెరలో ప్రసారం అయ్యే కొన్ని సీరియల్స్‌లో కనిపించనున్నాడట. పలు టాప్ రేటెడ్ సీరియల్స్‌కు సంబంధించిన కొన్ని సీన్లలో నటించి, తన సినిమా ప్రమోషన్స్ చేయనున్నాడు.

నితిన్‌తో (Nithiin) పాటు హీరోయిన్ కృతిశెట్టి కూడా ఈ సీన్స్‌లో కనిపించనుందని టాక్. 'మాచర్ల నియోజకవర్గం' సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించడం గమనార్హం.

Read More : Mahesh Babu Top Ten Movies: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబు టాప్‌ 10 సినిమాలు.. ప్రత్యేకంగా మీకోసం

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!