‘అర్జున్‌రెడ్డి’ విడుదలై అయిదేళ్లు..విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు థ్యాంక్స్: హీరోయిన్ షాలిని ట్వీట్

Updated on Aug 25, 2022 08:31 PM IST
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) షాలిని పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్‌ను స్టార్‌‌ హీరోగా నిలబెట్టింది
విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) షాలిని పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్‌ను స్టార్‌‌ హీరోగా నిలబెట్టింది

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ను స్టార్ హీరోగా నిలబెట్టిన సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఆగస్ట్ 25, 2017లో విడుదలైంది. అంటే సరిగ్గా ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయింది. కాగా ఇదే రోజున అంటే ఆగస్ట్ 25,2022న విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ కూడా విడుద‌లైంది.

విజ‌య్‌ని స్టార్ హీరోగా నిల‌బెట్టిన అర్జున్ రెడ్డి స‌క్సెస్‌ను ఆ మూవీ టీమ్ సెల‌బ్రేట్ చేసుకుంటోంది. అందులో భాగంగా హీరోయిన్ షాలినీ పాండే.. అర్జున్ రెడ్డి చిత్రంలో న‌టించిన విజ‌య్ దేవ‌ర కొండ‌కు థాంక్స్ చెబుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యం లేని పాత్రలో క‌నిపించిన విజ‌య్ దేవ‌రకొండ‌కు ‘ఎవ‌డే సుబ్రమ‌ణ్యం’ సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. త‌ర్వాత నటించిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా నిల‌దొక్కుకున్నారు. కానీ.. విజ‌య్​ని ఆడియెన్స్‌కు బాగా ద‌గ్గర చేసిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’.  ఈ సినిమా విజయ్​ని స్టార్ హీరోగా బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బెట్టింది. అర్జున్ రెడ్డి సినిమా ఇత‌ర భాష‌ల్లో విడుద‌ల కాలేదు. కానీ రీమేక్ అయ్యింది. అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మాత్రం దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో క్రేజ్ వ‌చ్చింది. ఆ సినిమా త‌ర్వాత హీరోగా యూత్‌కి బాగా ద‌గ్గర‌య్యారు.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) షాలిని పాండే హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్‌ను స్టార్‌‌ హీరోగా నిలబెట్టింది

ఎప్పటికీ మరచిపోలేని రోజు..

అర్జున్ రెడ్డి విడుద‌లై నేటికి అయిదేళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా అర్జున్​ రెడ్డి హీరోయిన్​ షాలినీ పాండే చేసిన పోస్ట్​ వైరలవుతోంది. ‘ఆగస్ట్ 25 అనే తేది.. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎప్పటికీ మరచిపోలేని రోజు. ఐదేళ్ల క్రితం నా తొలి చిత్రం అర్జున్ రెడ్డి ఇదే రోజున రిలీజ్ అయ్యింది. నా జీవితంలో మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది. ప్రీతి అనే పాత్రను నేను చేసినందుకు నాకు దక్కిన ప్రేమ, ప్రశంసలు వెలకట్టలేనివి.

అలాంటి పాత్రకు నన్ను ఎంచుకున్నందుకు.. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అర్జున్ రెడ్డి సినిమా బృందానికి రుణపడి ఉంటాను. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాగారికి థాంక్స్. అలాగే నా తొలి సినిమా ప్రయాణంలో సపోర్ట్ చేసిన మరో వ్యక్తి ఉన్నాడు. అతనితో కలిసి పని చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. అతనెవరో కాదు.. నా సహ నటుడు విజయ్ దేవరకొండ. విజయ్ అలియాస్ లైగర్.. నువ్వు నాకు చేసిన సాయానికి థాంక్స్’ అంటూ పోస్ట్​ చేసింది షాలిని పాండే. విజయ్ ​దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లైగర్​ భారీ అంచనాల మధ్య ఈరోజునే విడుదలవడంతో షాలినీ పోస్ట్​ రూపంలో తమ హీరోకి శుభాకాంక్షలు చెప్పిందంటూ మురిసిపోతున్నారు అభిమానులు.

Read More : 'ఖుషి' (Kushi) టైటిల్ పెట్టినందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గర్విస్తారంటున్న విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!