కార్తి (Karthi) హీరోగా నటించిన ‘విరుమన్’ నిర్మాతలకు డైమండ్ బ్రాస్‌లెట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్

Updated on Aug 20, 2022 06:36 PM IST
కార్తి (Karthi) హీరోగా నటించిన విరుమన్ సినిమా దర్శకుడికి డైమండ్ బ్రేస్‌లెట్‌ బహూకరించిన డిస్ట్రిబ్యూటర్
కార్తి (Karthi) హీరోగా నటించిన విరుమన్ సినిమా దర్శకుడికి డైమండ్ బ్రేస్‌లెట్‌ బహూకరించిన డిస్ట్రిబ్యూటర్

కార్తి (Karthi), అదితి శంకర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన తమిళ చిత్రం ‘విరుమన్’. ఆగస్టు11న విడుదలైన ఈ సినిమాకు హీరో సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు. ఎం‌.ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాడులో సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోంది.

విరుమన్ సినిమా డిస్ట్రిబ్యూటర్‌, శక్తి ఫిల్మ్‌ ఫ్యాక్టరీ అధినేత బి.శక్తివేలన్‌ విజయోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికపై బి.శక్తివేలన్‌ ‘విరుమన్‌’  సినిమా హీరో కార్తి, నిర్మాత సూర్య, సహ నిర్మాత పాండియన్‌ను సన్మానించి, డైమండ్‌ బ్రాస్‌లెట్లను బహూకరించారు. దర్శకుడు ఎమ్‌.ముత్తయ్యకు డైమండ్‌ రింగ్‌ గిఫ్ట్‌గా అందించారు.

విరుమన్ సినిమాలో కార్తి (Karthi)

మంచి కలెక్షన్లు..

చాలా వాయిదాల తర్వాత విడుదలైన ‘విరుమన్‌’ మంచి కలెక్షన్లు సాధిస్తోందని డిస్ట్రిబ్యూటర్‌ ఎం.ముత్తయ్య తెలిపారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ  సినిమా ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో నిలిచింది.

‘విరుమన్‌’ సినిమాలో దర్శకుడు శంకర్‌ కూతురు అదితి శంకర్‌ హీరోయిన్‌గా నటించారు. కార్తి (Karthi)  కీలకపాత్ర పోషించిన పాన్‌ ఇండియా సినిమా ‘పొన్నియిన్‌సెల్వన్‌ 1’ వచ్చే సెప్టెంబరు 30న విడుదల కానుంది. మరో చిత్రం ‘సర్దార్‌’ అక్టోబరులో రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Read More : ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాపై వివాదం.. మణిరత్నం (ManiRatnam), చియాన్‌ విక్రమ్‌ (Vikram)కు లీగల్ నోటీసులు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!